హనుమాన్ హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిశారు. హనుమాన్ సినిమా ఇటీవల 100 రోజుల ఫంక్షన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారితో ముచ్చటించి సినిమాకు సంబంధించిన పలు విషయాలను గవర్నర్ తెలుసుకున్నారు.
Hanuman hero Teja Sajja and director Prashant Varma met Telangana Governor CP Radhakrishnan.
Teja Sajja: ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా జనవరి 12న విడుదలైన హనుమాన్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పాన్ రేంజ్లో రిలీజ్ అయి అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలే వందరోజుల వేడుకను జరుపుకుంది. మొత్తం 25 థియేటర్లో 100 రోజులు ఆడింది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారిని ప్రశంసించారు. గవర్నర్ను కలిసిన హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆయనతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
చిన్న సినిమాగా విడుదలై ఇంత పెద్ద విజయం సాధించడం మాములు విషయం కాదని ప్రజలను భక్తిమార్గంలో, సన్మార్గంలో ప్రయాణించేలా హనుమాన్ ప్రోత్సహిస్తుందని గవర్నర్ ప్రశంసించారు. అలాగే పార్ట్ 2 గా తెరకెక్కుతున్న జై హనుమాన్ చిత్ర విషేశాలు సైతం డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణకు హనుమంతుని విగ్రహాన్ని బహుకరించారు. ప్రస్తుతం హనుమాన్ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
Had the incredible opportunity to meet the Honourable Governor of Telangana, Sri @CPRGuv garu and very humbled to receive accolades from him for our #HanuMan completing its glorious 100Day Run in theatres❤️