పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి రిలీజ్ ఎప్పుడు? అనేదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కల్కి కోసం మరో రెండు నెలలు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు.
Kalki: సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్ వంటి మాసివ్ ప్రాజెక్ట్ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడి’. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్‌గా ఈ మూవీని తెరక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ 600 కోట్ల బడ్జెట్‌తో కల్కిని నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఫైనల్ అవడం లేదు. మే 9న రావాల్సిన కల్కి ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో కొత్త డేట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ మేకర్స్ ఇంకా చర్చల దశలోనే ఉన్నారు. మే ఎండింగ్లో రిలీజ్ చేస్తే సమ్మర్ హాలీడేస్ కలిసి వస్తాయి. కానీ అప్పటికీ ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గదు. దీంతో జూన్ నెలలోనే కల్కి రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. జూన్ ఎండింగ్లో థియేటర్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
అయితే.. ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. మే మొదటి వారంలో కల్కి కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ జూన్ ఎండింగ్లో కల్కి వస్తే.. ఇక్కడి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మరో రెండు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏదేమైనా.. కల్కి కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే మరో వారం పది రోజులు వెయిట్ చేయాల్సిందే.