»Samantha Repurposes Her Wedding Gown Cannot Ignore Sustainability
Samantha : పెళ్లి గౌనును రీడిజైన్ చేయించేసిన సమంత!
నాగ చైతన్యతో తన పెళ్లి నాటి గౌనును సమంత మళ్లీ రీమోడలింగ్ చేయించేసింది. దాన్ని కొత్తగా మార్చేసి ధరించి ఓ అవార్డుల కార్యక్రమంలో మెరిసింది. ఆమె ఇంతకీ ఎందుకిలా చేసిందంటే..?
Samantha Wedding Gown : తెలుగు సినీ రంగంలో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చికున్న నటి సమంత. నాగ చైతన్యతో తన పెళ్లి నాటి వెడ్డింగ్ గౌనును ఈ మధ్య మళ్లీ రీ మోడలింగ్ చేయించేసుకుంది. అస్సలు పోల్చుకోలేని విధంగా ఆ గౌనును మార్చేసింది. మళ్లీ రీ డిజైనింగ్ చేయించుకున్న ఆ పొడవాటి గౌనును ఓ అవార్డుల కార్యక్రమానికి వేసుకొచ్చింది. ఇంతకీ తాను ఎందుకిలా చేసిందంటే…?
మయోసైటిస్ అనే అనారోగ్య కారణంగా ఈ మధ్య కాస్త నెమ్మదించిన సమంత(Samantha) సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటూ వస్తుంది. అలా తన వెడ్డింగ్ గౌన్‌ను రీ డిజైన్ చేయించుకున్న సంగతిని అందరితో పంచుకుంది. అయితే ఆమె పెళ్లి డ్రస్సును అసలు ఎందుకిలా చేసిందంటూ పలువురు ఆరా తీస్తున్నారు.
రీ డిజైనింగ్‌లో భాగంగా తెల్లటి రంగులో ఉన్న పొడవాటి పెళ్లి గౌను కాస్త నల్లటి షోల్డర్‌లెస్ బ్లాక్ డ్రస్‌గా మారిపోయింది. తాను సస్టెయినబులిటీకి ఇంపార్టెన్స్ ఇస్తానని సమంత(Wedding Gown) తెలిపింది. తన లైఫ్ స్టైల్‌ని సస్టెయినబుల్‌గా మార్చుకోవడంలో పాత దుస్తుల్ని మళ్లీ కొత్తగా మార్చుకోవడం ఒకటని తెలిపింది. ఈ డ్రస్‌ని ఇలా మార్చడంలో ఎంతో టాలెంటెడ్‌గా ఉన్న డిజైనర్లు పని చేశారని చెప్పుకొచ్చింది.