'ది కేరళ స్టోరీ(The Kerala Story)' అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. కేరళలోని కాసర్గోడ్లోని చాలా అమాయకంగా కనిపించే పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, బోధన, ISIS రిక్రూట్మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాల వల్ల ముగ్గురు బాధిత మహిళల దుస్థితిని చూపించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ చూసిన పలువురు విమర్శించినప్పటికీ ఈ చిత్రం రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మే 5న) విడుదలైన ఈ మూవీ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’ అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన సినిమా. కేరళలోని కాసర్గోడ్ పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, ట్రైనింగ్, ISIS రిక్రూట్మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాలు వంటి సంఘటనల ద్వారా బాధింపబడిన ముగ్గురు మహిళల దయనీయ దుస్థితిని దృష్టిలో ఉంచుకొని తీసిన ఊహాత్మక చిత్రం. సినిమా టీజర్, ట్రైలర్ లు విడుదలవగానే వివాదాలు చుట్టి ముట్టాయి. మతం,రాజకీయం అనే రెండు రంగులు పులుముకొని ఇండియాలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ సినిమా చివరకు ఈ రోజు విడుదలైంది. మరి అసలు సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిత్రంలో అదా శర్మ(adah sharma), యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలు పోషించారు. ‘ది కేరళ స్టోరీ’ UN డిటెన్షన్ సెంటర్లో గాయపడిన అదా శర్మ సన్నివేశంతో మొదలవుతుంది. విచారణ సమయంలో ఆమె శిక్షణ పొంది ISIS ఉగ్రవాదిగా ఎలా అడుగుపెట్టిందో గుర్తుచేసుకుంటుంది.
కథ
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లోని ఇసుక తెన్నెలున్న ప్రాంతం నుంచి మొదలై , దేవుళ్ళకు ఆవాస ప్రాంతంగా పిలవబడే కేరళకు చేరుకుంటుంది. కాసర్గోడ్లోని నర్సింగ్ కళాశాలలో చేరిన అదా శర్మ అక్కడ ఆమె ఇస్లాం మతంలోకి మారడానికి బ్రెయిన్‌వాష్ చేయబడిన మరో ఇద్దరు అమ్మాయిలను కలుస్తుంది. దీనితో పాటు ఏమి జరుగుతుందో అదే ‘ది కేరళ స్టోరీ’. ఇది ఒక డాక్యు డ్రామా ఫీచర్ లాంటి సినిమా అని చెప్పవచ్చు. ‘ది కేరళ స్టోరీ’లో కనిపించే ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత సన్నివేశాల మధ్య మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. సంజయ్ శర్మ ఎడిటింగ్ చక్కగా ఉంది అని చెప్పవచ్చు. ఈ సీన్స్ కి తగ్గట్టుగా మ్యూజిక్, కెమెరా పనితనం, కలర్ ప్యాలెట్ చాలా బాగా కుదిరాయి.
ఎలా ఉంది
‘ది కేరళ స్టోరీ’ స్క్రీన్‌ప్లే కూడా చక్కగా కుదిరిందని చెప్పవచ్చు. సినిమా చూస్తున్న ప్రేక్షకులను చివరి వరకు సీట్లకు అలాగే కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల నాటకీయత మొదటి నుంచి చివరి వరకు సినిమా.. 3 యాక్ట్ స్ట్రక్చర్ ని (Setup,Confrontation & Resolution)పర్ఫెక్ట్ గా అనుసరిస్తుంది అని చెప్పవచ్చు . ‘ది కేరళ స్టోరీ’ ఇతివృత్తంగా చూస్తే ఇది గొప్ప కథ. సినిమాలో హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యూనిజం, ఇస్లాం, షరియా చట్టాలను బోధించే ప్రక్రియ లాంటివి చూపడం చాలా పెద్ద సవాల్లే అనొచ్చు. ఇది సినిమాలో మరొక స్థాయి చర్చను లేవనెత్తుతుంది.
ఎవరెలా చేశారు
యాక్టింగ్ వైస్ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీలు చక్కగా నటించారు. సుదీప్తో సేన్(Sudipto Sen) దర్శకత్వ ప్రతిభ, విపుల్ షా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక చివరిగా వాస్తవాలు -వివాదాలు ఎలా ఉన్నప్పటికినీ ‘ది కేరళ స్టోరీ’ సినిమా అయితే చూడదగినదే.