The Kerala Story: ది కేరళ స్టోరీ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుక వచ్చింది. ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్నో వివాదాలు వచ్చాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాను బ్యాన్ చేయాలని విమర్శలు వచ్చాయి. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
కానీ ది కేరళ స్టోరీ మూవీ గతేడాది రిలీజ్ అయితే ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. జీ5లో వేదికగా ఓటీటీలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. స్ట్రీమింగ్ అవుతున్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ వన్లో కొనసాగుతోంది. మొత్తం 300 మిలియన్ల వాచ్ మినిట్స్ దాటిందని జీ5 పోస్టర్ను విడుదల చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం రూ.300 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.