»Pawan Kalyan Ready As Original Gangster Movie With Sujeeth
Pawan kalyan: పవన్ OGకి రంగం సిద్ధం!
తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) రాబోయే చిత్రం ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సుజీత్ దర్శకత్వానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఏప్రిల్‌లో షూట్ చేయడం ప్రారంభిస్తారని ఇటీవల చర్చలు వెలుగులోకి వచ్చాయి.
ఒకే సారి నాలుగు సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan). పొలిటికల్ కారణంగా ఆ సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే వినోదయ సీతం రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఆ వెంటనే హరీశ్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలు పెట్టేశారు. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ ఎనిమిది రోజుల పాటు జరిగింది. ఇందులో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ వెయ్యి మందితో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. అలాగే పవన్ కళ్యాణ్, శ్రీలీల పై కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేశారు. కొన్ని పోలీస్ స్టేషన్ సీన్స్ కూడా చిత్రీకరించారు.
ఇక అనుకున్న సమాయానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఓ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ ఓజీ(OG) కోసం రంగం సిద్దమవుతోంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(Original Gangster). ఓజీ టైటిల్‌తో యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే.. భారీ హైప్ క్రియేట్ అయింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కావడంతో.. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ముంబైలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనలైజ్ చేశారు.
ఏప్రిల్ 17 నుంచి ముంబైలో జరగనున్న ఓజీ(Original Gangster) షూటింగ్లో పవన్ జాయిన్ కానున్నారని సమాచారం. ఈ క్రమంలో ఓజీ టీమ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ఓ పోస్టర్ లేదా వీడియోను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్గా రెండు రోజుల పాటు ఈ షెడ్యూల్‌కు సంబంధించి టెస్ట్ షూట్‌ను నిర్వహించారట. దాంతో OG నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం పక్కా అంటున్నారు. మరి ఓజీ ఏం చేస్తాడో చూడాలి.