హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్‌పాత్‌లపై షాపులను కూడా తొలగించారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప...
ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 44 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 5.6గా గుర్తించారు. భూకంపం కారణంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించే సమయంలో జనాలు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు కుంగిపోయాయి. అధికార యంత్రాంగం రంగంలో దిగింది. సహా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీలో పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రహదారి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కొన్ని ఇళ్ల అక్రమ ఆక్రమణల విషయంలో కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ విషయంలో పవన్ చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఇవి ఆక్రమణలు కా...
ఏపీ సీఎం జగన్ ని చూసి… తెలంగాణ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో… ప్రధాని సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కెసిఆర్ రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బిజెపి తరఫున కోరుతున్నామని… సమాఖ్య స్పూర్తి ని మోడీ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి ...
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధ...
ప్రధాని నరేంద్రమోదీ… తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ.. ఇక్కడకు వస్తుంటే…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతుండటం గమనార్హం. కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం నుంచి దాదాపు వారం రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉ...
మాల్దీవుల్లో ఘోర అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో… 11మంది ప్రాణాలు కోల్పోగా… వారిలో 9మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం. మాల్దీవుల రాజధాని మాలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటలప్పుడు...
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. తెలుగు అమ్మాయి అంటూ చెప్పాడు. దాంతో త్వరలోనే శౌర్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు నాగ...
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను కుమ్మేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా వీర బాదుడు బాదారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. జోస్ బట్లర్ 80 పరుగులు చేయగా...
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. భవిష్యత్తులో ఎలా...
తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారంటూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా గవర్నర్ తమిళి సై సైతం అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పై ఆల్రెడీ ఒక ప్రాసెస్ కొనసాగుతుందని, ఎందుకు బోర్డ్ తీసుకు రావాల్సి వచ్చిం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్ పేర్కొనడం గమనార్హం. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ క...
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ను.. ఈ నెల 13 నుంచి మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా బ్యాంకాక్ అడవుల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత.. వచ్...
విజువల్ వండర్ రాబోతున్న అవతార్ సీక్వెల్స్ పై.. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అలాంటి సినిమాపై మరిచిపోండంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. మరి ఆయన ఎందుకలా అన్నాడనే విషయాన్ని ఓ సారి చూస్తే.. దాదాపు 13 ఏళ్ల తర్వాత అవతార్ పార్ట్ 2 రాబోతుంది.. డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతోంది. అయితే అవతార్ ప్రభంజనం సృష్టించడంతో.. అప్పుడే నాలుగు సిక్వెల్స్...
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. విమానం విక్టోరియా సర్సులో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. వె...