»Sajjala Ramakrishna Reddy Clarifies Buggana Visaka Capital Comments
Sajjala: అన్నీ ఒకేచోట అనలేదు కదా.. బుగ్గన రాజధాని దుమారంపై క్లారిటీ
మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు. రాజధాని ఒకేచోట కాదని, మూడు రాజధానులకు (three capitals) తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. శాసన, ఎగ్జిక్యూటివ్, న్యాయ.. ఇలా అన్ని ఒకేచోట ఉంటాయని ఎవరైనా మాట్లాడారా… అలా ఎవరు మాట్లాడలేదని, అంటే మూడు రాజధానులకు తమ పార్టీలోని వారు అందరూ అంగీకరించినట్లే కదా అన్నారు. అన్నీ ఒకేచోట అని ఎవరైనా అంటే మీడియా తమను ప్రశ్నించాలన్నారు. విశాఖ (visaka) పరిపాలనా రాజధానిగా, అమరావతిలో (Amaravati) అసెంబ్లీ, కర్నూలులో (Kurnool) న్యాయ రాజధాని ఉంటుందని పునరుద్ఘాటించారు. పరిపాలన వికేంద్రీకరణకు తాము కచ్చితంగా కట్టుబడి ఉన్నామన్నారు. ఎవరు కూడా అపోహలకు గురి కావొద్దన్నారు.
తాము ఎన్నికల కోసం ఈ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకు రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు చెబుతున్నామన్నారు. తాము గతంలో చెప్పినట్లుగానే మూడు రాజధానులతో ముందుకు వెళ్తామన్నారు. దీనికి ప్రజామోదం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. కొంతమంది సోకాల్డ్ పాదయాత్ర చేపట్టారని, వారు ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారని నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు. తాము చంద్రబాబులా ఎన్నికల కోసం ఓ నినాదం, ఆ తర్వాత మరో నినాదం ఇవ్వమన్నారు. రాజధాని పేరుతో తాము రాజకీయం చేయడం లేదని, వారు మాత్రమే చేస్తున్నారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజధాని సెంట్రలైజ్గా ఉండవద్దని, డీసెంట్రలైజ్ కావాలని చెప్పారు. రాజధాని పేరుతో సారవంతమైన నేలలో రాజధాని నిర్మించడం ఏమిటన్నారు. అంతేకాదు, ఇక్కడ రాజధాని అయితే ఖర్చు ఎక్కువ అని కూడా రాజధాని కోసం వేసిన కమిటీలు చెప్పాయన్నారు. చంద్రబాబు సంకుచిత ఆలోచనతో, స్వప్రయోజనాల కోసం, ఈ పేరుతో వేలకోట్లు సంపాదించాలనే ఉద్దేశ్యంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచించి అమరావతి రాజధాని అన్నారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు ఇచ్చిన అయిదేళ్ల కాలాన్ని వృధా చేశారన్నారు. అధికార వికేంద్రీకరణపై శివరామకృష్ణ కమిటీ క్లియర్‌గా చెప్పిందన్నారు.
చంద్రబాబు కారణంగా రాజధానిపై గందరగోళం ఏర్పడగా, జగన్ దానికి తెరదింపారన్నారు. తమ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఆలోచించిందన్నారు. తాము క్లియర్‌గా ఉండటంతో ప్రజలను కన్ఫ్యూజన్ చేసి, ఓట్లు పొందాలని మాత్రమే టీడీపీ చూస్తోందని ఆరోపించారు. ధర్మాన ప్రసాద రావు నుండి తమ పార్టీ వారు ఎవరు మాట్లాడినా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, శాసన రాజధాని.. ఇలా అన్నీ ఒకేచోట అని ఎవరూ అనడం లేదని, అలా అన్నప్పుడు తమ పార్టీని ప్రశ్నించాలన్నారు. అలా చెప్పనంత కాలం కన్ఫ్యూజన్ లేదని చెప్పారు. అసెంబ్లీ ఒక సెషన్ గుంటూరులో పెడతామని బుగ్గన చెప్పారు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియాలన్నారు. కన్ఫ్యూజన్ లేనిచోట ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇలా చేసే మీడియా రెండు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పుకు లోబడి ముందుకు సాగుతామన్నారు. రాజధానిపై చంద్రబాబు ఎవరితో డిస్కస్ చేయకుండా తన సొంత నిర్ణయంగా పెట్టారన్నారు.
అసలు చంద్రబాబు రాజధానిని పూర్తి చేసి, మొత్తం సిద్ధమైతే.. రాజధానిపై తాము మార్చే పరిస్థితి ఉండకపోయేదన్నారు. కానీ అమరావతిలో ఏదీ పూర్తి చేయలేదని, కాబట్టి తాము వికేంద్రీకరణకు మొగ్గు చూపామన్నారు. అమరావతి పూర్తి రాజధాని అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని.. ఇన్ని చూస్తే మూడు రాజధానులు లేదా వికేంద్రీకరణ సరైన ఆలోచన అన్నారు. తాము చంద్రబాబుపై కోపంతో పంతానికి పోయి రాజధానిపై ఇలా చేరడం లేదన్నారు. అమరావతి మాత్రమే రాజధాని అని టీడీపీ చెబుతుంటే, తాము దానిని తప్పకుండా తిప్పికొడతామని చెప్పారు. విశాఖను అభివృద్ధి చేస్తే టీడీపీకి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. పెట్టుబడులు ఇక్కడకు రావొద్దని వారు చూస్తున్నారా అన్నారు.