»Jairam Rameshs Letter To Rbi Sebi To Investigate Adani Group
Adani Group:పై దర్యాప్తు చేయాలని ఆర్బీఐ, సెబీకి జైరాం రమేష్ లేఖ
అదానీ గ్రూప్ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ ఛైర్పర్సన్ మాధబి పూరీ బుచ్‌లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ డిమాండ్ చేశారు.
అదానీ గ్రూప్(adani group)పై అమెరికా(america) సంస్థ హిండెన్‌బర్గ్ పరిశోధన(hindenburg research) రిపోర్ట్ నేపథ్యంలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(jairam ramesh) డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(reserve bank of india) గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ(SEBI) ఛైర్పర్సన్ మాధబి పూరీ బుచ్‌లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ కోరారు. సెబీ చీఫ్‌కు ఆయన రాసిన లేఖలో దర్యాప్తు న్యాయంగా, సంపూర్ణంగా ఉండాలని వెల్లడించారు. వైఫల్యం చెందిన భారతీయ కార్పొరేట్ సంస్థలపై భారతదేశ ఆర్థిక నియంత్రణ సంస్థల నిఘా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా నిధులను సేకరించే సంస్థల విషయంగా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన అనేక ఆరోపణలపై పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన పునరుద్ఘాటించారు.
Here are my letters to the RBI Gov & Chaiperson of SEBI expressing the hope that a full-fledged independent investigation will be carried on the numerous allegations against the PM- blessed Adani Group. pic.twitter.com/U7L8QLRb5f
తన లేఖలో చాలా ప్రైవేట్ ఫండ్లు చాలా తక్కువ రేటుతో ఉన్నాయని గుర్తు చేశారు. అదే క్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(lic), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వంటి ఆర్థిక సంస్థలు అదానీ గ్రూప్ ఈక్విటీని ఎందుకు ఎక్కువ రేటుకు కొనుగోలు చేశాయని ఆయన తన లేఖలో ప్రశ్నలను లేవనెత్తారు. మరోవైపు 30 కోట్ల మంది భారతీయులు తమ జీవిత పొదుపును విశ్వసిస్తున్న ఎల్ఐసి, ఇటీవలి రోజుల్లో అదానీ గ్రూప్ స్టాక్స్ కారణంగా వేల కోట్ల రూపాయలను కోల్పోయిందన్నారు. అటువంటి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు తమ పెట్టుబడుల విషయంలో తమ ప్రైవేట్ రంగ ప్రత్యర్ధుల కంటే ఎక్కువ సంప్రదాయబద్ధంగా ఉన్నాయన్నారు.
ఇక ఆర్బీఐ(RBI) గవర్నర్‌కు రాసిన లేఖలో, సెంట్రల్ బ్యాంక్ తప్పనిసరిగా రెండు అంశాలను పరిశీలించాలని జైరాం రమేష్(jairam ramesh) అన్నారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థతో అదానీ గ్రూప్ నిజమైన వ్యవహారాలు, ఈ గ్రూప్‌కు విదేశీ నిధులు తగ్గితే తర్వాత ప్లాన్ ఏమిటి వంటి అంశాలను ప్రస్తావించారు. అదానీ గ్రూప్ ఇచ్చిన స్పష్టమైన హామీలు ఏమిటి? విదేశీ నిధులు కరువయ్యాయా అని లేఖలో పేర్కొన్నారు. గత రెండు వారాల్లో అదానీ గ్రూప్(adani group)లోని కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి.
US ఆధారిత సంస్థ హిండెన్‌బర్గ్(hindenburg research) జనవరి 24న తన నివేదికలో అధిక వాల్యుయేషన్లు, అకౌంటింగ్ మోసం వంటి కారణాలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ నివేదిక అబద్ధం తప్ప మరేమీ కాదని అదానీ గ్రూప్ వెల్లడించింది. అంతేకాదు గ్రూప్ స్టాక్స్‌లో కొనసాగుతున్న అమ్మకాల కారణంగా దాని ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేసిన రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను రద్దు చేసింది.