ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నిన్న కేంద్ర హోంత్రి అమిత్ షా బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోమతి జిల్లాలోని అమర్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు క...
వరంగల్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిన డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ తోపాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి కూడా మృత్యువాత చెందింది. దీంతోపాటు కారులోని మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. డీసీఎంకు పంక్చర్ అయిన క్రమంలో రోడ్డు పక్కన ఆపి వారు రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఈ ప్రమ...
టర్కీ, సిరియాల్లో సంభవించిన భీకర భూకంపం(Turkey earthquake) దాటికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,300 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టర్కీలో 3000 మందికిపైగా మృతి చెందారని, మరోవైపు సిరియాలో బాధిత మృతుల సంఖ్య 1500కు చేరిందని వెల్లడించారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని తొలగిస్తున్నారు. మరోవైపు టర్కీ, సిరియాలో సుమారు 19 వేల...
స్టార్ హీరో ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ హీరో నటించిన సార్ మూవీ ట్రైలర్ రేపు(ఫిబ్రవరి 8న) రిలీజ్ కానుంది. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ని స్ట్రిక్ట్ లెక్చరర్‌గా చూపిస్తున్న కొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తూ ప్రకటించారు. వెంకీ అట్లూరి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90ల నాటి కథాంశంతో తెరకెక్కించనట్లు తెలుస్తోంది. వ్యాపార లాభం కోసం పిల్లలకు వ...
స్పీడుగా రైడ్ చేస్తున్న రెండు బైక్ లను చేయిలతో పట్టుకుని ఆపగలరా? కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. కానీ ఓ పోటీలో భాగంగా పంజాబ్ కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ (24) అనే వ్యక్తి ఏకంగా నాలుగు బుల్లెట్ బైక్ లను ఆపాడు. అది కూడా మాములుగా కాదు. తాళ్లను నాలుగు ద్విచక్రవాహనాలకు కట్టి బైకర్లు వాటిని ముందుకు రైడ్ చేస్తుండగా లవ్ దీప్ చేతులతో పట్టుకుని ముందుకు వెళ్లనీయకుండా ఆపేశాడు. పంజాబ్ లుథియానా జిల్లాలో...
ఫిబ్రవరి 5న ప్రారంభమైన దూరాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. లింగమతుల స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో జాతర మొత్తం జనాలతో కోలాహలంగా మారింది. సోమవారం ఈ గొల్లగట్టు జాతరకు మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రె...
తెలంగాణలో రైతుల పంట రుణాలు ఈ ఏడాది రూ.90 వేల లోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అందుకోసం బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో రూ.37 వేల నుంచి రూ.90 వేల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయి. అయితే గత బడ్జెట్లో రూ.4000 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈసారి మరో రూ.2,385 కోట్లు అదనంగా పెంచింది. రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో సీఎం...
టర్కీని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం నమోదైంది. ఈ భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని వందల మంది ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా…. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జ...
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...
టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యో...
త్వరలో తెలంగాణలో 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ త్వరలోనే రానుందన్నారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్ట్స్ హైదరాబాద్ సమ్మిట్2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యాపార ప్రముఖులతో కలిసి ఈ మొబిలిటీ వ్యాలీ...
టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి ఉదయం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించగా తాజాగా మూడోసారి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 12 గంటల వ్యవధిలోనే మూడ...
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలకృష్ణ. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో దేవబ్రాహ్మణుల మనోభావాలను ఆయన దెబ్బతీసేలా మాట్లాడాడని నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానించేలా మాట్లాడ్డంతో కొందరు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత నర్సులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు అ...
ఆగ్నేయ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో 600 మందికి పైగా మరణించారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. దీంతో చాలా మంది తమ ప్రాణాలను నిద్రలోనే కోల్పోయారు. భూకంపం వల్ల సిరియాలో 245 మందికిపైగా చనిపోయారు. అదేవిధంగా టర్కీలోనూ 284 మందికిపైగా మరణించార...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై వివాదం సద్దుమణగడం లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. మేయర్ పదవుల ఎన్నికకు తాజాగా సోమవారం మూడోసారి సమావేశం కాగా మళ్లీ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహంంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో ఈ పంచాయితీని తేల్చుకోవడానికి సిద్ధమైంది...