»Manthani Assembly Constituency Election 2023 Which Party Won Seats
Manthani constituency:లో ఈసారి కూడా ఆ పార్టీదే విజయం?
తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వార్తను ఓసారి చదివేయండి మరి.
ఈ ఏడాది డిసెంబర్ లోపు తెలంగాణ(telangana)లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గ నేతలను సిద్దం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం నువ్వా నేనా అంటూ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం(manthani assembly constituency)లో ఈసారి ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
శ్రీధర్ బాబు ఓటమి
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి BRS తరఫున పుట్టమధు(putta madhu) గెలుపొందగా…1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు(duddilla sridhar babu) ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత వచ్చిన 2018 ఎన్నికల్లో మళ్లీ శ్రీధర్ బాబు విజయ ఢంకా మోగించారు.
పుట్టమధు అవినీతి!
2014లో పుట్టమధు ఎన్నికైన తర్వాత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక దాందా, భూ కబ్జాలు, పలు పథకాల పేరుతో నిధుల గోల్ మాల్ చేశారనే ప్రచారం జరిగింది. మరోవైపు అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. మరోవైపు రాష్ట్రంలోగా అడ్వొకేట్వామన్ రావు దంపతుల హత్య(vaman rao death) కేసులో పుట్ట మధు ప్రమేయం ఉందన్న ఆరోపణలు సైతం వచ్చాయి. ఇక తర్వాత 2018లో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు మళ్లీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వైపు మెగ్గు చూపారు. కానీ శ్రీధర్ బాబు(sridhar babu) ఎన్నికైన తర్వాత కొన్ని రోజులకు తాను స్థానికంగా ఉండటం లేదని హైదరాబాద్ లోనే ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మందితో మాత్రమే ఎమ్మెల్యే టచ్లో ఉంటున్నారని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మళ్లీ శ్రీధర్ బాబునే?
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ దుద్దిళ్ల శ్రీధర్ బాబునే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ తరఫున పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ సీనియర్ లీడర్ చల్లా నారాయణ తనకు పోటీగా వస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు కాంగ్రెస్(congress), బీఆర్ఎస్(BRS) తప్పులను ఎండగడుతూ బీజేపీ(BJP) నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి(chandupatla sunil reddy) ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మంథని నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకున్నవారే లేరని సునీల్ రెడ్డి అంటున్నారు. సునీల్ రెడ్డి ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అమెరికాలో ఉద్యోగం వదులుకుని తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమనేత అనే ప్రజల్లో సానుభూతిని సంపాదించుకున్నాడు.
మంథనిలో ప్రధాన సమస్యలు
మంథని నియోజకవర్గం(manthani constituency)లో ప్రధానంగా పలు గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) బ్యాక్ వాటర్ సమస్య ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్నా కూడా రామగిరి, ముత్తారం, మంథని మండలాల్లోని 20 గ్రామాల్లో దాదాపు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. అందుకోసం సరస్వతి బ్యారేజ్ దగ్గర పోతారం లిఫ్ట్ నిర్మించాలని కోరుతున్నారు. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన స్థానిక రైతులకు పూర్తిగా న్యాయం జరగలేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధును పుట్టమధు తన అనుచరులకే ఇప్పించుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి తరుణంలో ప్రజలు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో 2022 డిసెంబర్ నాటికి 2 లక్షల 19 వేల 120 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా 9 వేల 14 మంది పురుషులు ఉండగా, లక్షా 10 వేల మంది మహిళలు ఉన్నారు.