బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour 🔴⚪️🟡🟢🔵Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌లోకి అడుగు పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక...
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. తొలి వన్డే 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగ్గా అందులో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా 349 పరుగులు చేసింది. అయితే 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 208 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓ తప్పు చేయడంతో ఐసీసీ జరిమానా విధించింది. ఆ తప్పును [&he...
విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్...
సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...
నాలుగు పదుల వయసు దాటగానే వాకింగ్ చేయాలంటేనే చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ 80 ఏళ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబయి మారథాన్‌లో పరిగెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్‌లో 55,000 మందికి పైగా పాల్గొనగా ఓ బామ్మ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. మారథాన్‌లో బామ్మ చలాకీగా పాలుపంచుకోవడం అందరిలో స్ఫూర్తి నింపింది. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ బామ్మ మార...
అంబేడ్కర్ స్మృతివనం త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై శుక్రవారం సీఎం అధికారులతో సమీక్షించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న విగ్రహం, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చి నె...
“పుష్ఫ” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయంగా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి బన్నీ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్నీ బన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఒక మంచి అనుభూతిని ఇచ్చిన దుబాయ్ కి ధన్యవాదాలు తెలిపారు. తనకు గోల్డెన్ ...
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల కోతపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక విధమైన భయాందోళన వాతావరణం కమ్ముకుంది. దీంతో దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విటర్, షేర్ చాట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించగా.. తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులను సాగనంపింది. దాదాపు 400 మంది ఉద్యోగు...
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ బృందం పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పెట్టుబడులు రాగా.. తాజాగా దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చింది. డాటా సెంటర్లకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ లో మరో 3 డేట...
‘బిచ్చగాడు’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2’ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ...
అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగ...
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్ తగిలింది. ‘గడపగడపకు’లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు జీఎస్‌డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు. గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆనంకు సూచించారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన ఆనంకు వైసీపీ వరుస వేధింపులకు దిగుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలో ఆనం సీనియర్ నేత అయినప్పటిక...
హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో రసాయనాలు లీకయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమంగా రసాయనాలు నిల్వ చేస్తుండడంతో అవి లీకై తీవ్ర ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. శ్వాస ఆడక అవస్థలు పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం 11:30 గంటలకు మొదలై 4 గంటల వరకు కొనసాగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బ...
తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. వేమన పద్యాల్లాంటి స్వచ్ఛమైన మనసు తమ ముఖ్యమంత్రి జగన్ ది అని పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిర...