న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు. దీంతో ఆ దేశానికి 41 ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ నిలువనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా అధ...
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంది. అంతేకాకుండా రోడ్డు పక్కనున్నవారిపై కూడా ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల...
మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో నేడు సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా, మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా అదే బాటలో నడిచింది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ లో స్వైటెక్ 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో పరాజయం పాలైంది. ఈ పోరు కేవలం గంటన్నరలో ముగి...
చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో చైనాలో 13 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు తేలింది. చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12వ తేది వరక...
టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ లో బళ్లారి ఫెస్టివ్ లో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని గెస్టులుగా విచ్చేశారు. మొదటి రోజు కార్యక్రమంలో సింగర్ మంగ్లీతో కలిసి మరికొంత మంది గాయకులు పాల్గొన్నారు. గత క...
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...
తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...
రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజనకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాలేదు. సంస్థలు, నిధులు, ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు రావాల్సిన బకాయిలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన నిధులు తెలంగాణకు చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. విభజన మొదటి ఏడాది ...
కామం మైకంలో వావివరసలు చూడడం లేదు. పిల్లాజెల్లా అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా దుర్మార్గులు చిదిమేస్తున్నారు. అలా ఒకరు మేనమామ వరుసైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర...
తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో...
తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావి...
మహిళలపై నేరాలను అరికట్టడంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అబలలకు అండగా కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు ఉండడంతో కొద్దోగొప్పో మహిళలపై అఘాయిత్యాలు అదుపులో ఉన్నాయి. తాజాగా కేరళ ఉన్నత న్యాయస్థానం సంచలన ప్రకటన చేసింది. పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ మాదిరి నో మీన్స్ నో (వద్దంటే వద్దు) అని కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మహిళ లేదా బాలిక వద్దంటే వద్దు అనే అర్థమని, దీన్ని పుర...
ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటి నుంచే రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకట...