Cancel Bandi Sanjay Lok Sabha membership:Puvvada ajay
Puvvada ajay:పదో తరగతి కొశ్చన్ పేపర్ లీకేజీ ఇష్యూపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల మనసులు గెలవాలే తప్ప విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదని చెప్పారు. పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ బీజేపీ (bjp) కనుసన్నలో జరిగిందని ఆరోపించారు. ప్రధాని మోడీ (modi), హోం మంత్రి అమిత్ షా (amith shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా (nadda), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పదో తరగతి కొశ్చన్ పేపర్ లీకేజీ కుట్ర పన్నిన కేసులో బండి సంజయ్‌ను (bandi sanjay) కఠినంగా శిక్షించాలిన అన్నారు. ఆయనకు ఎంపీగా (mp) కొనసాగే నైతిక అర్హత లేదని చెప్పారు. సంజయ్ (sanjay) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసే కుట్రలతో పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తే భర్తీ ప్రక్రీయను ఆపేందుకు లీకులకు తెరలేపారని పువ్వాడ అజయ్ (ajay) ఆరోపించారు. చివరికీ పదో తరగతి పరీక్షా పేపర్లు లీకేజీ చేసి చేశారన్నారు. బండి సంజయ్ (ajay), రేవంత్‌రెడ్డి (revanth reddy) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.