తనకు ప్రభుత్వం నుండి ప్రాణాపాయం పొంచి ఉందని, ఆహారంలో విష ప్రయోగం (food poisoning) జరిగే ప్రమాదం ఉందని, భద్రతాపరంగా తనను కరీంనగర్ జైలుకే పంపించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ (BJP telangana chief bandi sanjay) జడ్జికి విన్నవించుకున్నారు. సంజయ్ కోరినట్లుగా కరీంనగర్ జైలుకు (karimnagar jail) తరలించేందుకు అంగీకరించిన జడ్జి, ఆహారాన్ని కూడా ముందుగా తనిఖీ చేశాకే ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సెస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ (ssc paper leak case) వ్యవహారంలో బండి సంజయ్ ను పోలీసులు అక్రమంగా తరలించారనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. శివ గణేష్ అనే వ్యక్తి తన స్నేహితుడి కోసం కమలాపూర్ పరీక్ష కేంద్రంలో పేపర్ ఫోటో తీయడం, అక్కడి నుండి అది జర్నలిస్ట్ ప్రశాంత్ అనే జర్నలిస్ట్ కు రాగా, అక్కడి నుండి మీడియాకు, బండి సంజయ్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ కు గం.11.24 నిమిషాలకు వాట్సాప్ ద్వారా వచ్చింది. మరో అరగంటలో పరీక్ష ముగుస్తుంది అనగా వచ్చింది. అంటే ఇందులో బండి సంజయ్ పాత్ర ఎక్కడిది, మీడియాకు, రాజకీయ నాయకులకు ఈ లీక్ గురించి చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా పంపించి ఉండవచ్చు కదా అని అంటున్నారు. ఈ కేసులో బండి సంజయ్ ని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విధానాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
పోలీసులు అతనిని బుధవారం సాయంత్రం గం.7.00 సమయానికి హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిప్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత నివాసానికి వెళ్లి హాజరు పరిచారు. సంజయ్ కు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిని ఖమ్మం జైలుకు (khammam jail) తరలించారని భావించారు. కానీ భద్రతా కారణాల వల్ల తనను కరీంనగర్ జైలుకు తరలించారని చెప్పారు. దీంతో అంగీకరించారు. అలాగే భోజనం చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కరీంనగర్ జైలుకు తరలించారు. రాత్రి పది గంటలకు కారాగారంలోకి పంపించారు. రిమాండ్ ఖైదీ నెంబర్ 7917ను కేటాయించారు. ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ బ్యారక్ ను కేటాయించారు. కరీంనగర్ వచ్చే దారిలో పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు (bjp activists) అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని పక్కకు తప్పించారు. ఆయన బెయిల్ దరఖాస్తు పైన (bandi sanjay bail) విచారణ గురువారానికి వాయిదా పడింది. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ వర్గాలు ఆందోళనలు, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం (kcr effigy) చేశాయి. గురువారం కూడా ఆందోళనలు నిర్వహించనున్నాయి.
పోలీసులు కొట్టారని ఫిర్యాదు
పోలీసులు మిమ్మల్ని కొట్టారా అని న్యాయమూర్తి అడిగారు. దీనికి బండి సంజయ్ ఏసీపీ, సీఐలు కొట్టారంటూ చొక్కా తీసి గాయాలను చూపించారు. తనను అకారణంగా అరెస్ట్ చేశారని, కారణాలు కూడా వెల్లడించలేదన్నారు. రోజంతా అనేక ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్ర గందరగోళం సృష్టించారన్నారు. సంజయ్ పైన మోపిన నేరాలు ఏడేళ్ల లోపు శిక్ష కలిగినవి అని, ఆయనను వెంటనే విడుదల చేయాలని లాయర్లు కోరారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం చాలామంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడివడి ఉందని, సంజయ్ బయటకు వెళ్తే శాంతిభద్రతలకు విఘాతమని బెయిల్ వద్దని కోరారు. పోలీసులు తమ వివరణ కోసం గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది. ఇరుపక్షాల వాదనల అనంతరం సంజయ్ కు రిమాండ్ విధించారు. గురువారం బెయిల్ పిటిషన్ పైన వాదనలు పూర్తి కానున్నాయి.
తెలంగాణ పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తదితరులు బుధవారం ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తెలంగాణ పోలీసుల పైన సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. సంజయ్ అరెస్ట్ పైన తాము న్యాయ పరంగా పోరాడుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాగా, మిగతా నిందితులు బూర ప్రశాంత్, గుండెబోయిన మహేష్, మౌటం శివగణేష్ లను జైలుకు తరలించారు.
మొహంలో అదే చిరునవ్వు, అదే ఉత్సాహం. ఎంత మంది కేసిఆర్ లు ఎన్ని కుట్రలు చేసినా బెదరని మా ఉక్కు మనిషి, మా కాషాయ దళపతి బండి సంజయ్ కుమార్ ✊ భారత్ మాతా కీ జై 🚩 pic.twitter.com/PrqiGZZbRl
— A.Venkata Ramana (Modi ka Parivar) (@AVRBJP) April 5, 2023