పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగులతో రాణించాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
Rajasthan royals Target: పంజాబ్ కింగ్స్ (Punjab kings).. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) ముందుభారీ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 56 బంతుల్లో 86 పరుగులతో చెలరేగిపోయాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 60 పరుగులు చేసి రాణించాడు. జితేశ్ శర్మ 27 రన్స్ జోడించారు. ఆది నుంచి పంజాబ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లు తీసుకున్నారు. అశ్విన్ యుజుర్వేంద్ర చాహల్ తలొ వికెట్ దక్కింది. లైవ్ విన్ ప్రిడిక్స్ ప్రకారం పంజాబ్ విజయ అవకాశాలు 57 శాతం ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 43 శాతం ఉంది. మరీ రాయల్స్ బ్యాట్స్ మెన్ ఎలా ఆడతారో చూడాలీ.