రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.
ఈనాడు పత్రికాధినేత రామోజీ రావు (eenadu ramoji rao) పైన సోషల్ మీడియాలో (Social media) సెటైర్లు వస్తున్నాయి. మార్గదర్శి కేసులో (margadarshi case) ఏపీ సీఐడీ (AP CID) విచారణ నేపథ్యంలో ఆయన తీరు పైన నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. ఈ అంశంపై నటుడు, నిర్మాత నాగబాబు (Naga Babu)స్పందించారు. ఆయన రామోజీ రావుకు (Ramoji Rao) మద్దతు పలికారు. తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి రామోజీ రావు అని ట్వీట్ చేశారు. ఆయన లక్షలాది మందికి ఆదర్శమని, ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వైసీపీ అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరమన్నారు. ఏడు పదుల వయసుపైబడిన రామోజీ రావు గారిని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయమన్నారు. అలాగే, రామోజీ రావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండిస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో రామోజీపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
రామోజీ రావును (ramoji rao) సమర్థించడంపై నాగబాబుపై (naga babu) నెటిజన్లు మండిపడుతున్నారు (netizens satires on naga babu for supporting ramoji rao). కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న తరుణంలో నాగబాబు పోస్టులు సరికాదంటున్నారు. అంతేకాదు, చిరంజీవి ప్రజారాజ్యాన్ని (chiranjeevi party praja rajyam) నడపలేని తరుణంలో జెండా పీకేద్దాం అంటూ ఈనాడులో కథనం (eenadu story on praja rajyam) వచ్చిన విషయాన్ని నాగబాబు (naga babu) మరిచిపోయినట్లు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఆ కథనం వచ్చాక ప్రజారాజ్యం కార్యకర్తలు (praja rajyam activists) ఈనాడు ప్రతులు దహనం (eenadu) చేసిన విషయం గుర్తుకు లేదా అని అడుగుతున్నారు.