వైయస్ జగన్ ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని బతిమాలుతున్నడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP government) ట్రైలర్ చూపించామని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బుధవారం అన్నారు. విశాఖ వీ కన్వెన్ష్ సెంటర్ లో జరుగుతున్న టీడీపీ జోనల్ సమీక్ష సమావేశంలో (TDP meeting) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ పాలనలో (YCP government) ఎస్సీల పైన దాడులు పెరిగాయన్నారు. ఎస్సీలను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే కూడా కేసులు పెడుతున్నారని చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కేలా టీడీపీ పార్టీ పని చేసిందని, ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి సైకిల్ రావాలన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో టీడీపీ పని చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఒక గెలుపు ఉత్సాహం ఇస్తుందన్నారు. కడపలో కూడా మనం గెలిచామని వ్యాఖ్యానించారు. టీడీపీ దెబ్బకు జగన్ మీటింగ్ పెట్టాడన్నారు.
ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఇప్పుడు మాత్రం ఓటమి తర్వాత ఎవరినీ తప్పించనని బతిమాలుతున్నారన్నారు. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని, దేవుడు జగన్ కు డేంజర్ బెల్స్ కొట్టాడన్నారు. తాము తలుచుకుంటే తాడేపల్లి ప్యాలెస్ కూల్చడం ఎంత సేపు అన్నారు. తనకు విశాఖ నగరం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ తనకు ఇల్లు లేదని, అధికార పార్టీ వలె భూములను ఆక్రమించనని, అక్రమాలు జరగనివ్వనని చెప్పారు. తాను జీవితాంతం ఉత్తరాంధ్ర, విశాఖ వాసులకు రుణ పడి ఉంటానని చెప్పారు. ప్రశాంత విశాఖలో గంజాయి కల్చర్, గన్ కల్చర్ తీసుకు వచ్చారన్నారు. రైతు బజార్ లు తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అన్నారు. దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీవి, చివరి నిమిషంలో టిక్కెట్ మార్పునకు సహకరించిన చిన్న లక్ష్మీ కుమారిని చంద్రబాబు సత్కరించారు.