హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బలంగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో వర్ష ప్రభావం ఉంది.
Hyderabad:హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (rain) కురుస్తోంది. బలంగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. జూబ్లీహిల్స్ (jubilee hills), బంజారాహిల్స్ (banjara hills), గచ్చిబౌలి (gachibowli), మణికొండ (manikonda), పంజాగుట్ట (panjagutta), అమీర్ పేట (ameerpet), ఎస్ఆర్ నగర్ (sr nagar), సికింద్రాబాద్‌లో (secunderabad) వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.
మాసబ్ ట్యాంక్ (masab tank), నాంపల్లి (nampally), లక్డీకపూల్ (Lakdikapul), మాదాపూర్ (madhapur), హైటెక్ సిటీ (hitech city), మెహిదీపట్నం (mehdipatnam), టోలీచౌకీలో (toli chowki) ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులు రావడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆపీసుల నుంచి బయల్దేరిన ఉద్యోగులు వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. వర్షపునీరు (rain water) రహదారులపైకి చేరడంతో.. వాహనదారులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ రోజు సాయంత్రం నుంచే వాతావరణం మారిపోయి.. ఆ తర్వాత వర్షం పడుతుంది.
ఇటు శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజులు పగటిపూట ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియనస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో సిటీకి ఎల్లో అలర్ట్ జారీచేశారు.
మరోవైపు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోతాదు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్ల వాన కూడా కురవనుందట. ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.