• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఆ రోజే మనకు నిజమైన పండుగ: సీఎం కేసీఆర్

ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్ధవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం గొప్పదనం, ప్రాధాన్యం వివరిస్తూనే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేన...

January 25, 2023 / 09:14 PM IST

భారీ ఎత్తున తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు

తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 60 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసినట్టు బదిలీలు ఉన్నాయి. ఒకే చోట అత్యధిక కాలం ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ బదిలీల విషయమై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్...

January 25, 2023 / 08:52 PM IST

అనుష్క పేరుతో సినీ రేంజ్ మోసం.. రూ.51 లక్షలు లూటీ

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...

January 25, 2023 / 05:42 PM IST

సెలవు దొర: జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సంజయ్ దొర.. మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నాను. మీ గడీల నుంచి బయటకు వస్తున్నా, ఇదిగో నా రాజీనామా ప...

January 25, 2023 / 05:13 PM IST

జెండా పండుగకు కరోనా అడ్డంకినా? కేసీఆర్ పై గవర్నర్ ఆగ్రహం

గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని...

January 25, 2023 / 03:16 PM IST

వారాహికి ఏపీలో ఘన స్వాగతం, సెల్ఫీలు హంగామా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఘన స్వాగతం లభించింది. జనసేన వీర మహిళలు హారతులు ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి ఆహ్వానించారు. జన సైనికులు ఈలలు, కేకలతో పవన్ పైన పూలు జల్లుతూ కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి పై నుండి అందరికీ అభివాదం చేశారు. ఈ వాహనం మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంటుంది. అంతకుముందు అర్ధరాత్రి ఈ వాహనం ఆంధ్రలోకి ఎంట్రీ ఇచ్చింది. వాహనానికి మూడు కార్లు ఎ...

January 25, 2023 / 02:58 PM IST

ఎంపీ అవినాష్‌రెడ్డికి షాక్.. విచారణకు రావాల్సిందే: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల కిందట మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని...

January 25, 2023 / 02:39 PM IST

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జనవరి 26వ తేది నుంచి 31వ తేది వరకూ రెడ్ అలర్ట్ ను కొనసాగించనున్నారు. ఈనెల 31వ తేది వరకూ ఎయిర్ పోర్టులో సందర్శకులకు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకు...

January 25, 2023 / 02:24 PM IST

పెరిగిన కరోనా కేసులు..అక్కడ 5 రోజుల లాక్ డౌన్

తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు పలు దేశాల్లో మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో కరోనా కేసులు అధికంగా పెరగడం వల్ల 5 రోజులు లాక్ డౌన్ విధించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్యాంగ్యాంగ్ లో బుధవారం నుంచి లాక్ డౌన్ నియమాలు పాటించనున్నా...

January 25, 2023 / 11:58 AM IST

షారుక్ పఠాన్ సినిమా పోస్టర్లు దగ్ధం

బీహార్‌ లోని భాగల్‌పూర్ ఓ సినిమా హాలులో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చించివేసి, తగులబెట్టారు. భాగల్‌పూర్ దీప్‌ప్రభ సినిమా హాలులో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. హిందూ సంస్థలకు చెందిన పలువురు సినిమా హాలులో ఉన్న పోస్టర్లను చించి, దగ్ధం చేశారు. ఫిల్మ్ చలేగా హాల్ జలేగా అంటూ నినదించారు. హిందూత్వంతో రాజీపడేది లేదని, సనాతన సంస్కృతిని వ్యతిరేకించే, కించపరిచే ఏ అంశాన్...

January 25, 2023 / 09:29 AM IST

పార్టీలో ఉంటే స్టాలిన్ ను ఒప్పుకుంటా: అళగిరి

కరుణానిధి తనయుడు, కేంద్ర మాజీమంత్రి అళగిరి తన సోదరుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ను నాయకుడిగా అంగీకరించనున్నారు. త్వరలో డీఎంకేలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే డీఎంకే అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు, క్రీడాశాఖా మంత్రి ఉదయనిధి మదురై వెళ్లి తన పెదనాన్న అళగిరిని కలిశారు. ఉదయనిధికి అళగిరి కుటుంబం సాదర స్వాగతం పలికింది. అనంతరం ఉదయనిధి-అళగిరి ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు...

January 25, 2023 / 09:07 AM IST

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో 3 వందేభారత్ రైళ్లు

దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే.. మరో 3 సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రైల్వేఅధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించ...

January 25, 2023 / 08:32 AM IST

బాబుతో వెళ్తే పవన్ కు నష్టం: టిడిపిపై లక్ష్మీపార్వతి ఫైర్

లక్ష్మి పార్వతి మరోసారి తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రతిపక్షం తెర తీసిందన్నారు. రూ.100 చీర, ...

January 25, 2023 / 01:04 PM IST

RRR : ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్.. అవార్డుకు అడుగు దూరంలో

RRR : ప్రస్తుతం ప్రపంచమంతా మన సినిమా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. తాజాగా ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకుంది. 95 వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఈ సినిమా నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ కు చెందిన పది సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా పాట నాటు నాటు పాట నామినేషన్స్ లో...

January 24, 2023 / 07:50 PM IST

Breaking : ఢిల్లీలో భారీ భూకంపం.. రోడ్ల మీదికి పరుగెత్తిన జనం

Breaking : దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 2.28 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఢిల్లీతో పాటు పలు చుట్టు పక్కన ప్రాంతాలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ కేంద్రంగా.. ఉత్తరాఖండ్ లోని పిథోరాఘర్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో భూకం...

January 24, 2023 / 04:13 PM IST