Ranji Trophy 2023: విజేత మళ్లీ సౌరాష్ట్ర…సొంతగడ్డపై బెంగాల్ జట్టుకు షాక్
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.
రంజీ ట్రోఫీ టైటిల్(Ranji Trophy 2023) ను మళ్లీ సౌరాష్ట్రనే కైవసం చేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 19న) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచులో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్(kolkata)ను ఓడించి విజయం సాధించింది. మరోవైపు గత 3 సీజన్లలో సౌరాష్ట్ర(saurashtra)కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర 404 పరుగులు చేసింది. ఈ క్రమంలో బెంగాల్(bengal) తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైంది. 230 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన బెంగాల్.. జయదేవ్ ఉనద్కట్ ధాటికి 241 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత 12 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో ఛేదించడంతో నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. దీంతో 2023 రంజీ చాంపియన్ గా సౌరాష్ట్ర నిలిచింది.
ఉనద్కత్(unadkat) 129 పరుగులతో 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అర్పిత్ వాసవాడ 10 గేమ్‌లలో 907 పరుగులతో సీజన్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ప్రకటించబడ్డాడు. మయాంక్ అగర్వాల్ (9 మ్యాచ్‌లలో 990) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. మేము రెండు సార్లు విజయం సాధించగలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నానని సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్(saurashtra captain unadkat) అన్నాడు. అవును మేము గెలిచాము. కానీ రంజీ మా కోసం ఎదురు చూస్తుందని.. నేను మావారికి చెప్పానని పేర్కొన్నాడు. బెంగాల్ జట్టు(bengal team) గెలవాలంటే మేము నిజంగా మరింత కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. మూడేళ్లలో.. రెండు టైటిళ్లు గెలవడానికి ఇదే మా విజయ రహస్యమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
బెంగాల్ గెలిస్తే 33 ఏళ్ల తర్వాత తమ మొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను పొందిన జట్టుగా నిలవనుంది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ కావడంతో బెంగాల్(bengal team) జట్టు సౌరాష్ట్రను ఓడించాలని చూసినా కూడా అది సాధ్యపడలేదు. 2020లో జరిగిన ఫైనల్(final match) పోరులో సౌరాష్ట్ర బెంగాల్ జట్టును ఓడించింది.