»Ranji Trophy 2023 Final Match Beng Vs Sau Eden Gardens Kolkata
Ranji Trophy 2023: ఫైనల్ మ్యాచ్..33 ఏళ్ల తర్వాత మళ్లీ గెలుస్తారా?
ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.
నేడు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మొదలు కానుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన సౌరాష్ట్ర, బెంగాల్ ట్రోఫీ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే సొంతగడ్డ కావడంతో బెంగాల్ జట్టు సౌరాష్ట్రను ఓడించాలని చూస్తోంది. మరోవైపు సౌరాష్ట్ర సైతం ఇంకోసారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలవాలని భావిస్తోంది. 2020లో జరిగిన ఫైనల్ పోరులో సౌరాష్ట్ర బెంగాల్ జట్టును ఓడించింది. ఈ పోరులో బెంగాల్ గెలిస్తే 33 ఏళ్ల తర్వాత తమ మొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను పొందిన జట్టుగా నిలవనుంది.
Just 1⃣ sleep away from the #RanjiTrophy summit clash! ⏳
బెంగాల్ టైటిల్ గెలవాలనే ఆకలితో ఉండటమే కాదు, ప్రతీకారం కూడా వారి మనస్సులో ఉంటుంది. చివరిసారిగా 2020లో బెంగాల్ ఫైనల్‌కు చేరుకుంది. సౌరాష్ట్ర రాజ్‌కోట్‌లోని వారి సొంత మైదానంలో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా గతంలో టైటిల్‌ను గెలుచుకుంది. కానీ 1990లో బెంగాల్ తమ చివరి రంజీ ట్రోఫీని గెలుచుకున్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈసారి కూడా ఫైనల్స్ జరగడం విశేషం. రంజీ ఫైనల్లో రెండు జట్లూ కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. బెంగాల్ జట్టు ఇప్పటివరకు మూడుసార్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు సార్లు ఫైనల్స్ కూడా చేరారు. మధ్యలో COVID-19 మహమ్మారి కారణంగా 2020-21 రంజీ ట్రోఫీ సీజన్ రద్దు చేయబడింది.
లైవ్ కోసం
బెంగాల్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరిగే రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. దీంతోపాటు దేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్‌లలో కూడా ఈ మ్యాచ్ ప్రసారం చేయబడుతుంది.
బెంగాల్ vs సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ అంచనా