»Ncrb Report Kolkata Is Top Among The Safest Cities What Is The Position Of Hyderabad
Kolkata: సురక్షిత నగరాల్లో కోల్‌కతా టాప్.. హైదరాబాద్ స్థానం ఏంతంటే?
భారతదేశంలో సురక్షితమైన నగరాల జాబితాను ఎన్సీఆర్బీ వెల్లడించింది. అందులో ప్రథమ స్థానంలో కోల్‌కతా ఉంది. మొదటి స్థానంలో కోల్‌కతా ఉండడం ఇది మూడో సారి కావడం విషేశం. తరువాత స్థానాల్లో ఏ నగరాలు ఉన్నాయి? హైదరాబాద్ స్థానం ఎంత? అనేది తెలుసుకుందాం.
NCRB report.. Kolkata is top among the safest cities.. What is the position of Hyderabad?
Kolkata: భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాల్లో కోల్‌కతా మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంకాలు-2022 నివేదికను ఎన్సీఆర్బీ (NCRB) తాజాగా విడుదల చేసింది. అందులో తక్కువ నేరాలు నమోదవుతున్న నగరాల జాబితాను వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది కోల్‌కతా(Kolkata) అగ్రస్థానంలో నిలిచింది. తరువాత రెండో నగరంగా పుణె (Pune) రెండు, హైదరాబాద్ (Hyderabad) మూడో స్థానంలో నిలిచాయి. ప్రతి లక్ష జనాభాకు జరుగుతున్న నేరాల సంఖ్యను బట్టి NCRB ఈ జాబితాను తయారుచేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు, ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన నేరాలను పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్‌ను రూపొందించారు. ఈ గణాంకాల ప్రకారం 2022లో కోల్‌కతా 86.5 కేసులు, పుణెలో 280.7 కేసులు, హైదరాబాద్‌లో 299.2 కేసులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది.
2021తో పోలిస్తే కోల్‌కతాలో నేరాల సంఖ్య తగ్గింది. లక్ష జనాభాకు సగటు నేరాల సంఖ్య 103.4 గా నమోదు అయింది. పుణెలో 256.8, హైదరాబాద్‌లో 259.9 కేసులు నమోదయ్యాయి. 2022లో అత్యంత ఎక్కువ కేసులు నమోదు చేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర (Maharashtra) నిలిచింది. గతేడాది ఈ రాష్ట్రంలో 8218 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ తెలిపింది.అత్యధిక హత్య కేసుల్లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), అత్యాచార కేసుల్లో రాజస్థాన్ (Rajasthan) టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.