కొంతమంది ఎమ్మెల్సీలు గవర్నర్ తమిళసాయి పట్ల ఉపయోగించిన భాషను చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల టీఆరెఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలున్నాయి. మహిళ పట్ల.. అది కూడా గవర్నర్ పట్ల ఇలాంటి మాటలు ఏమిటని అన్ని పార్టీలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈటల కూడా ఈ వ...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ తన వెబ్ సైట్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఉంచింది. మెయిన్స్ కు ఎంపికైన 6,456 మంది అభ్యర్దుల జాబితాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 111 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ జనవరి 8న పరీక్ష నిర్వహించింది. ఈ వడపోత పరీక్షకు 87,718 మంది హాజరయ్యారు. మొత్తం 29...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో పదవి లభించింది. ఆ పదవితో దేశంలోనే అరుదైన గౌరవం పొందారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత నియామకమయ్యారు. ఈ విషయాన్ని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ ప్రకటించారు. ఏడాది పాటు కవిత ఆ పదవిలో ఉండనున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో చేసిన సేవలు ఇకపై దేశవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ...
సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లే...
తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంఘి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగా...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. పరిమిత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 176 పరుగులు చేసి భారత్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్, కాన్వే రాణించారు. మిచెల్ నాట్ అవుట్ గా నిలిచి 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిన్ […]
సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మారేడుపల్లిలో ఉన్న శ్రీలా హిల్స్ అనే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కన ఉండే ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రమాదం ఎలా జరిగింది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.
యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...
టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధ...
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మీద బీబీసీ చానెల్ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకుంటున్నారని విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎన్ఎస్ యూఐకి చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శ...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుంచి శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్ దీప్ యాదవ్, శివమ్ [&...
నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో యాత్ర కొనసాగుతోంది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. భద్రతా వైఫల్యంతో రాహుల్ తన యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో స్థానిక యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. ప్రజలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని గుర్తి...
‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ల...
తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడ...