బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్య...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్...
ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం, జనసేన పొత్తుపై కూడా అంబటి స్పందించారు. ఎంతమంది కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. మళ్లీ జగన్ ముఖ్య...
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నారా లోకేష్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో కా...
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు....
ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని పలు భవనాల...
బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే, తగ్గించిన ఘనత జగన్ దే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళంలో భాగంగా రెండరోజు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన జగన్ ను ఇంటికి పంపాల్సిందేనన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 2...
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తెలంగాణలోని హనుమకొండలో సక్సెస్ మీట్ ను ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో గేట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా అభిమానులంతా ముందుకు తోసుక...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు విచారణ చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని.. సీబీఐ విచారణకు సహకరిస్తానని అవినాశ్ తెలిపారు. అధికారులకు ఉన్న అనుమానాలకు సమాధానం ఇచ్చానని.. వీడియో, ఆడియోకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తదుపరి విచారణ కోసం మళ్లీ పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పుడు కూడా తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అయినా కూడా శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో బాలకృష్ణ ఉన్నారు. ఆసుపత్రికి చంద్రబాబు, పురందేశ...
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని ప్రకటించారు. ఎవరు ఏమిటో ప్రజల వద్ద తేల్చుకుందామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తెలంగ...
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు తదితర వాటి పేర్లు మారడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారుస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మరో ముఖ్యమైన ప్రాంతానికి పేరు మార్చింది. స్వాతంత్ర్యం పూర్తి చేసుకుని 75 ఏళ్లు పూర్తయిన ...
రవాణా సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలను సజ్జనార్ ప్రారంభించారు. ఏఎమ్ 2 పీఎమ్ అనే సరికొత్త కొరియర్ సేవలను శుక్రవారం ప్రారంభించగా.. శనివారం ఆర్టీసీ బస్సుల్లో రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలా రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలు ప్రారంభించి ప్రయాణికులకు ఆర్ట...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. నందమూరి కుటుంబసభ్యులంతా తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని కుటుంబసభ్యులే కాకుండా నందమూరి అభిమానులు కోరుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే తన సోదరుడు ఆరోగ్యం బాగా లేక...
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు భారీగా కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగింది. ఒక్కసారిగా రోడ్డు మీద గుంత పడటంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు అందులో చిక్కుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతలో ఒక ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మి...