అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.
హిండేన్ బర్గ్ రీసెర్చ్ (hindenburg research) నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ (adani group) సంపద దారుణంగా పతనం అయ్యింది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ (market capitalisation) ఏకంగా 100 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. సోమవారం ఒక్కరోజే ఈ సంస్థ మార్కెట్ క్యాప్ ఏకంగా 3.1 బిలియన్ డాలర్లు నష్టపోయింది. అంటే ఇది మన కరెన్సీలో 25 వేల కోట్ల రూపాయలకు పై మాట. హిండేన్ బర్గ్ రీసెర్చ్ అనంతరం ఏకంగా 132 కోట్ల బిలియన్ డాలర్లు నష్టపోయింది. అదే సమయంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక మార్కెట్ క్యాప్ తో పోలిస్తే ఏకంగా 193 బిలియన్ డాలర్లు కుప్పకూలింది.
జనవరి 24వ తేదీ నుండి అదానీ టోటల్ గ్యాస్ 76 శాతం నష్టపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 69 శాతం, అదానీ ట్రాన్స్ మిషన్ 68 శాతం మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. అదానీ గ్రూప్ కంపెనీల సెల్ ఆఫ్ పెరుగుతుండడంతో స్టాక్ ఎక్సేంజ్ సర్క్యూట్ లిమిట్ ను 20 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అదానీ ఫ్లాగ్ షిప్ అదానీ ఎంటర్ ప్రైసెస్ మార్కెట్ క్యాప్ జనవరి 24 న 3.92 ట్రిల్లియన్లు కాగా .. ఇప్పుడు 1.84 ట్రిలియన్లకు తగ్గింది. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ టోటల్ గ్యాస్ సోమవారం లోయర్ సర్క్యూట్ ను తాకాయి. న్యూ ఢిల్లీ టెలివిజన్ 3.7 శాతం, అదానీ విల్మర్ 1.9 శాతం నస్తోయాయి.
మరోవైపు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.