Turkey earthquake: టర్కీలో మరో భూకంపం, భూమి ముక్కలవుతుందా అన్నట్లుగా…
టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 6.4 గా నమోదు అయ్యింది. పక్షం రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో నిరాశ్రులయ్యారు. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో మరోమారు భూకంపం ఆందోళన కలిగించింది.
టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 6.4 గా నమోదు అయ్యింది. పక్షం రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో నిరాశ్రులయ్యారు. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో మరోమారు భూకంపం ఆందోళన కలిగించింది. ఇప్పటికే ప్రకంపనాలు సహాయక చర్యలకు అడ్డు పడుతున్నాయి. ఫిబ్రవరి 6 వ తేదీన టర్కీ, సిరియా లలో రెక్టర్ స్కేల్ పైన 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత 40 కి పైగా ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు సోమవారం టర్కీ, సిరియా బోర్డర్ లో మరోసారి వచ్చింది. భూమి ముక్కలు అవుతుంది అన్నట్లుగా కంపించింది అని స్థానికులు చెబుతున్నారు.
హతాయ్ ప్రావిన్స్ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి మూడు అపార్ట్మెంట్లు కూలిపోయాయి. ముగ్గురు చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. కాగా భారీ భూకంపం కారణంగా టర్కీ, సిరియాలలో దాదాపు 48,000 మంది మృతి చెందారు. ఇందులో టర్కీ మరణాలు 42 వేల వరకు ఉన్నాయి. దాదాపు నాలుగు లక్షల ఇళ్లు కుప్పకూలాయి. భూకంపం ప్రాంతాల్లో కుప్పకూలిన అపార్టుమెంట్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు టర్కీ ప్రధాని తెలిపారు.