తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఫిబ్రవరి 22న తారక్ బర్త్ డే. సరిగ్గా తన పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. జనవరి 27న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో జాయిన్ అయ్యారు తారకరత్న. పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారని, తన బర్త్ డే వేడుకల్లో పాల్గొంటారని అంతా భావించారు. కానీ, ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యాన్స్ ను దుఃఖ సాగరంలోకి నెట్టింది.
కాగా.. తారకరత్న .. తన చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఆయన ఒక్కసారైనా బాలకృష్ణ తో కలిసి నటించాలని అనుకున్నారట. బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో ఓ పాత్రలో నటించాలని కూడా అనుకున్నారట. కానీ… ఆ కోరిక తీరనేలేదు. అంతేకాకుండా… తారకరత్న… రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఆశపడ్డారు. తాను ఎమ్మెల్యే గా పోటీచేస్తానని ఆయన చాలా సార్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని కూడా ఆశ పడ్డారు. కానీ ఈ రెండు కోరికలు తీరకుండానే ఆయన ప్రాణాలు కోల్పోవడం మరింత బాధ కలిగిస్తోంది.