»Virat Kohli Is The Fastest To Score 25 Thousand Runs In International Cricket
Virat Kohli: ఇంటర్ నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు..సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఆదివారం జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో(international cricket) అత్యంత వేగంగా 25,000 పరుగులు(25000 runs) చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ కోహ్లి ఓ బౌండరీని బాదడంతో ఈ మార్కును దాటేశాడు. అతను కేవలం 31,313 బంతుల్లో, 549 ఇన్నింగ్స్‌లలో విరాట్ ఈ మైలురాయిని సాధించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఈ ఘనత సాధించిన కోహ్లి, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(sachin tendulkar), రికీ పాంటింగ్(riki painting)ల రికార్డులను దాటేశాడు. అయితే ఇదే ఘనతను గతంలో సాధించిన పలువురు క్రీడాకారులను ఇక్కడ చూడవచ్చు.
అంతర్జాతీయ క్రికెట్(international cricket)లో విరాట్ 549 ఇన్నింగ్స్‌లలో అత్యధిక స్కోరు 254తో 25,012 పరుగులు చేశాడు. అతని సగటు పరుగులు 53.55 కాగా, స్ట్రైక్-రేట్ 79.82. తన అంతర్జాతీయ కెరీర్లో 74 సెంచరీలు, 129 అర్ధసెంచరీలు చేశాడు. అతను 2,482 బౌండరీలు, 278 సిక్సర్లు బాదాడు. 34 ఏళ్ల కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో 12,809 పరుగులు, టెస్టుల్లో 8,195 పరుగులు, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20I)లో 4,008 రన్స్ చేశాడు. అంతర్జాతీయ వేదికలపై 25,000 పరుగుల మార్క్‌ను చేరుకున్న ఆరో ఆటగాడిగా, ఇండియాలో రెండో వ్యక్తిగా విరాట్ నిలిచాడు. మరోవైపు మూడు ఫార్మాట్ల(three formats)లో 74 సెంచరీలు సాధించిన స్టార్ ఇండియన్ బ్యాట్స్ మెన్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు 100 చేసిన సచిన్ కంటే జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు.
రెండో టెస్టు(second test) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(australia) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం సాధించలేక 262 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 1 పరుగు ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 62 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో మ్యాచ్ దాదాపుగా సమమైంది. ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు భారీ ఆధిక్యం సాధించడం ద్వారా టీమ్ ఇండియా(team india)పై ఒత్తిడిని సృష్టించగలదని భావించారు, కానీ ఇది జరగలేదు. జడేజా, అశ్విన్ జోడి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టు మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించింది.