»Minister Khawaja Asif Admitted That He Was Bankrupt Pakistan Kg Of Chicken More Than 700
Pakistan: దివాళా తీసిందని ఒప్పుకున్న అక్కడి మంత్రి..రూ.700 దాటిన కిలో చికెన్
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ 700 రూపాయలు దాటగా, లీటర్ పాలు రూ.200కు చేరాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకునేందుకు రెండు గోల్ఫ్ క్లబ్లను విక్రయించనున్నట్లు చెప్పారు.
పాకిస్తాన్(pakistan) దేశం ఇప్పటికే దివాళా(bankrupt) తీసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) ఒప్పుకున్నారు. ప్రస్తుతం దివాలా తీసిన దేశంలో జీవిస్తున్నామని, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. IMF వద్ద పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం లేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో తమ సమస్యలకు పరిష్కారం దేశంలోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెండు గోల్ఫ్ క్లబ్(golf clubలను విక్రయిస్తే పాకిస్తాన్ రుణంలో నాలుగింట ఒక వంతు చెల్లించవచ్చని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం రాజకీయ నాయకులే కారణమని ఆసిఫ్ ఆరోపించారు. తన 33 ఏళ్ల పార్లమెంట్లో 32 ఏళ్ల పాటు దేశ రాజకీయాలు అతి దారుణంగా దిగజారడం చూశానని చెప్పారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం మరో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వార్షిక ద్రవ్యోల్బణం(inflation) ఈ వారంలో దాదాపు 40 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లీటర్ పాల ధర రూ.200 దాటేసింది. కేజీ చికెన్(kg chicken) రేటు కూడా 700 రూపాయలు దాటింది. ఇవి అసలు ధర కంటే దాదాపు 120 శాతం పెరిగాయని అక్కడి ప్రజలు అంటున్నారు.
అయితే USD 6 బిలియన్ డాలర్ల విలువైన 2019 ఒప్పందంలో కీలకమైన USD 1.1 బిలియన్ భాగాన్ని విడుదల చేయడానికి ఇస్లామాబాద్(islamabad)అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో చర్చలు జరుపుతోంది. అయితే కొత్త పన్నుల విధింపుతో సహా అనేక దశలను IMF సిఫార్సు చేయడంతో చర్చలు ఇంకా విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో చర్చలు జరిపేందుకు వచ్చిన ఐఎంఎఫ్ బృందం గత వారం తుది అంగీకారం కుదరకుండా వదిలేయడంతో పాకిస్థాన్ మరింత భయాందోళనకు గురవుతోంది. పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(pak pm shehbaz sharif) అన్ని ముందస్తు షరతులకు అంగీకరించినప్పటికీ చర్చలు సఫలం కాలేదు.
ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పన్నులు(new taxes) విధించడంతోపాటు పెట్రోలియం ధరల(petrol rates)ను కూడా పెంచింది. దీంతో ధరలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ద్రవ్యోల్బణాన్ని(inflation) అదుపు చేసేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ అది అదుపులోకి రాకపోగా మరింత తీవ్రం అవుతోంది. దీంతోపాటు ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం ద్వారా ఆర్థిక లోటును నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారీ పొదుపు చర్యలను ప్రకటిస్తారని ఆసిఫ్ తెలిపారు.