»Ravanasura Movie Pyaar Lo Na Pagal Lyrical Video Song Out
Ravanasura: నుంచి రవితేజ పాడిన సెకండ్ సింగిల్ రిలీజ్
మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.
ధమాకా, వాల్తేరు వీరయ్య వరుసగా రెండు బ్లాక్‌బస్టర్స్‌తో మాస్ మహారాజా రవితేజ హైట్రిక్ హిట్స్ దిశగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మరో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ రావణాసుర(Ravanasura)లో రవితేజ(raviteja) నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో పాట అయిన ప్యార్ లోనా పాగల్ లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ పాటను హీరో రవితేజ పాడటం విశేషం. ఓ కనకమాలచ్చి ఇట్టా ప్రేమించి వదిలి వెళ్లకే అంటూ రవితేజ పాడిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లవ్ బ్రేకప్ ప్రధాన అంశంపై కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ పాటకు కాసర్ల శ్యామ్(Kasarla Shyam) లిరిక్స్ అందించగా..హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సమకూర్చగా, శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో శ్రీరామ్, ఫరియా అబ్ధుల్లా(Faria Abdullah) కూడా డాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు.
ఇక ఈ చిత్రానికి సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వం వహిస్తుండగా..రావణాసుర టైటిల్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది. రవితేజ సరసన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel), ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అక్కినేని సుశాంత్(Sushanth), సహా తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రావణాసుర ఆంథమ్, సింగిల్ సాంగ్ కూడా అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన సెకండ్ సింగిల్ కూడా అదిరిందని చెప్పవచ్చు. రవితేజ్ మంచి ఎనర్జీతో పాటతోపాటు స్టెప్పులు వేస్తూ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ బ్యానర్ పై రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న సమ్మర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.