Harish Shankar: రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈగిల్ (2024) గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు మిశ్రమ ఫలితం తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేసిన స్టూడియో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో సక్సెస్ మీటింగ్ జరిగింది. ‘మాస్ మహారాజా’ సన్నిహితుడు హరీష్ శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఒక వెబ్ సైట్‌పై విరుచుకపడ్డారు.
ఈ మూవీలో లవ్ స్టోరీ లేదని రాశారు.. సినిమాలో హీరో గన్ను పట్టుకుని యాక్షన్ చేస్తుంటే లవ్ స్టోరీ అంటాడేంటి? అంటూ చురకలు అంటించారు. అదే సమయంలో సినిమా జరల్నిస్ట్లు సినిమా ఇండస్ట్రీలో భాగమే అని, వాళ్లు వేరు, మేము వేరు కాదన్నారు. అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్ లేదని, ఏదైనా బాగలేకపోతే దర్శకుడు ఇక్కడ బాగా చేశాడు, ఇక్కడ చేయలేదని చెప్పండి. చేసిన మిస్టేక్ ఏంటో చెప్పండి, అది కాకుండా పర్సనల్ ఎటాక్ చేయడం ఏంటని ప్రశ్నించాడు హరీష్. కార్తీక్ ఘట్టమనేనిని విమర్శించే ముందు ఆయన బ్యాక్ గ్రౌండ్ చూడాలని, అతను అద్భుతమైన కెమెరామెన్ అని, సినిమాలు చేస్తే ఇప్పుడు అతని చేతిలో పది సినిమాలుంటాయి. అంత బిజీగా ఉంటాడు. కానీ సినిమాటోగ్రాఫర్‌గానే కాదు, దర్శకుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. చాలా కష్టపడి అద్భుతమైన సినిమా తీశాడు. ఇప్పుడు దాన్ని ప్రపంచమంతా అభినందిస్తుంది. విమర్శించే ముందు అతను జర్నీ ఏంటి? ఏం చేశాడు? ఎలాంటి సినిమా తీశాడనేది ఆలోచించాలి కదా అని అన్నారు.