IND vs AUS 2nd Test : రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను టీమిండియా(Team India) మట్టికరిపించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను టీమిండియా(Team India) మట్టికరిపించింది. దీంతో ఈ సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ముందు 115 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ 26.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను రీచ్ అయ్యింది. ఓపెనర్ రోహిత్ శర్మ(Rohith sharma) దూకుడుగా ఆడాడు. 20 బంతుల్లోనే 31 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ రెండు సిక్సులను కూడా బాదాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడనే చెప్పాలి. కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇకపోతే 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత బ్యాటర్ చటేవ్వర్ పుజారా ఈసారి కాస్త నిదానంగానే ఆడాడు. వికెట్ పడకుండా 74 బంతుల్లో 31 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) 20 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 12 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఆఖర్లో బరిలోకి దిగిన శ్రీకర్ భరత్ టెస్టు మ్యాచ్ ను వన్డే మ్యాచ్ లెవల్లో ఆడాడు. భరత్ 22 బంతుల్లోనే 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
For his magnificent all-round performance including a brilliant 7⃣-wicket haul, @imjadeja receives the Player of the Match award 🏆#TeamIndia win the second #INDvAUS Test by six wickets 👌🏻👌🏻
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 61/1తో ప్రారంభించిన ఆస్ట్రేలియా 54 పరుగులు మాత్రమే చేసింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), రవించంద్రన్ అశ్విన్(Ashwin) లు అద్భుతమైన బౌలింగ్ తో విరుచుకుపడ్డారు. వారి బౌలింగ్ దాడిని తట్టుకుని ఆసీస్ బ్యాటర్లు నిలువలేకపోయారు. జడేజా 7 వికెట్లను పడగొట్టాడు. అశ్విన్ 3 వికెట్లను తీశాడు.
In his 1️⃣0️⃣0️⃣th Test, @cheteshwar1 finishes off the chase in style 🙌🏻#TeamIndia secure a 6️⃣-wicket victory in the second #INDvAUS Test here in Delhi 👏🏻👏🏻
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అసీస్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 113 పరుగులకే వెనుతిరిగింది. తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా(Team India) ఆరు వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. దీంతో ఈ సిరీస్ లో భారత్ 2 మ్యాచ్ ల్లో గెలిచి ముందంజలో ఉంది.