• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

టాస్ గెలిచిన న్యూజిలాండ్..బ్యాటింగ్ చేయనున్న భారత్

ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీ20 తర్వాత వన్డే మ్యాచుల్లో భారత్ మొదటి స్థానంలోకి చేరుకోనుంది. అంతేకాకుండా వన్డే చరిత్రలోనే కివీస్ పై టీమిండియా మూడోసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్ల క్రితం 2010లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో టీమ...

January 24, 2023 / 01:44 PM IST

కేరళలో ‘నోరో’ టెన్షన్..19 మంది విద్యార్థులకు పాజిటివ్

కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలి...

January 24, 2023 / 01:18 PM IST

చేతులతో వేగంగా పరుగెత్తి గిన్నిస్ రికార్డు..వీడియో వైరల్

అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో విజయాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. పట్టుదలతో సాధన చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో జియాన్ క్లార్క్ కూడా ఒకరని చెప్పాలి. జియాన్ క్లార్క్ అంగవైకల్యంతో పుట్టినా ఎప్పుడూ కూడా తన వైకల్యాన్ని చూసి కుంగిపోలేదు. నిత్యం తన చేతులతో సాధన చేస్తూనే ఉన్నాడు. అలా సాధన చేస్తూ అత్యంత వేగంగా పరుగెత్తి గిన్నీస్ రికార్డును సాధించాడు. తాజాగా జియాన్ క్లార్క్ ...

January 24, 2023 / 11:45 AM IST

అద్భుతం..మరో భూ గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. భూమిని పోలిన మరో భూ గ్రహాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. దాదాపుగా భూమి మాదిగానే ఉన్న ఓ గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో గుర్తించారు. పైగా ఆ గ్రహం కూడా భూమి పరిమాణంలోనే ఉండటం విశేషం. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఆ గ్రహం ఉందని, దానిని ఎల్‌హెచ్‌ఎస్‌ 475గా పిలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా మన సౌరవ్యవస్థకు అవతల ఓ గ్రహాన్ని ఇంతటి...

January 24, 2023 / 10:27 AM IST

సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ దాడులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు సర్జికల్ దాడులే జరగలేదని, ఆ దాడులకు ఆధారాలు కూడా లేవన్నారు. నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల్లో ఉగ్రవాదులను చంపేశామని అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని ఆరోపించారు. 2016, 2019లో పా...

January 24, 2023 / 10:15 AM IST

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..ఏడుగురు మృతి

కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీ అని అధికారులు గుర్తించారు. తోటి వర్కర్లపై అతడు కాల్పులు జ...

January 24, 2023 / 10:10 AM IST

తోసి పడేయండి ఆ ఎధవల్ని: జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం

విద్యార్థుల ప్రవర్తనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోపోద్రిక్తులయ్యారు. ఎధవలు.. వారిని తోసి పడేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్యాంట్లు, హెయిర్ కట్ ఏమిటీ అని మండిపడ్డారు. ఏం సాధించారని విర్రవీగుతున్నారని కోపాన్ని అణుచుకోలేక విద్యార్థులను తిట్టిపోశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆయనకు కోపమొచ్చేలా విద్యార్థులు ఏం చేశారో తెలుసుకోండి. నల్లగొండ పట్టణంలో ‘జనగణమన ...

January 23, 2023 / 09:58 PM IST

వీళ్లు మారరు.. ఈసారి హైదరాబాద్ విమానంలో రచ్చరచ్చ

విమాన ప్రయాణమంటే చిరాకు తెప్పించేలా ప్రయాణికుల వ్యవహారం కొనసాగుతోంది. మొన్న విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది. ఈసారి ఢిల్లీ- హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో రచ్చ జరిగింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన వారిని కిందకు దించేసి విమానం యథావిధిగా బయల్దేరింది. ఈ సంఘటన జరిగిన రోజే...

January 23, 2023 / 08:44 PM IST

మోదీజీ ఇక ఉండలేను.. నేను దిగిపోతా: మహారాష్ట్ర గవర్నర్

అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలుగాలని భావిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రకటించారు. 80 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు విరమించుకుని మిగిలిన శేషజీవితంలో రాయడం, చదవడం వంటి పనులతో కాలక్షేపం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించి సంచలనం రేపారు. ఈ విషయమై ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం భగత్ సింగ్ కోశ్...

January 23, 2023 / 07:19 PM IST

బరి తెగించిన హ్యాకర్లు.. సజ్జనార్ ట్విటర్ ఖాతా హ్యాక్

సంచలనాలకు మారుపేరుగా నిలిచే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఏ శాఖలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. అందుకే ఆయనపై ప్రజలు పూలవర్షం కురిపిస్తారు. తనదైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థను ప్రగతి పట్టాలెక్కిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన అనంతరం ఆర్టీసీ రూపురేఖలు మారాయి. అటు పాలనపరంగా.. ఇటు ప్రయాణికుల పరంగా ఆర్టీసీని మరి...

January 23, 2023 / 06:54 PM IST

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించింది. సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ పేరు, సునీల్ కుమార...

January 23, 2023 / 05:48 PM IST

మీకోసం జైలుకైనా వెళ్తా.. నిరాహార దీక్ష చేస్తా: పొంగులేటి

ప్రత్యేక అజెండాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సరికొత్త రాజకీయం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గం సత్తా చాటేలా రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైత...

January 23, 2023 / 04:16 PM IST

రాళ్ల దాడిపై మంగ్లీ స్పందన.. బళ్లారిలో జరిగింది ఇదే..!

కర్ణాటకలో మంగ్లీ కారుపై దాడి జరిగిందని.. కన్నడ భాష మాట్లాడకపోవడంతో కొందరు దాడికి పాల్పడ్డారనే వార్తలు ఆదివారం గుప్పుమన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. మంగ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుపై రాళ్ల దాడి చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పుడు కథనాలని మంగ్లీ కొట్టి పారేసింది. అదంతా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవా...

January 23, 2023 / 03:39 PM IST

యాదాద్రీశా ఏమిటీ ఘోరం.. లవర్ మోజులో పిల్లల్ని వదిలేసిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో  తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చ...

January 23, 2023 / 04:14 PM IST

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ కన్నుమూశారు. తన నానమ్మ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన నానమ్మ చివరి వరకూ ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆమె ద్వారానే  తెలుసుకున్నానన్నారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తించుకునే ఉంటానన్నారు. తన నానమ్మ నుంచి ఎలాంటి అనుభూతులు పొందానో తన పిల్లలకు...

January 23, 2023 / 01:08 PM IST