Kanna Lakshmi Narayana : పార్టీ వీడటానికి కన్నా చెప్పిన కారణం ఇదే….!
Kanna Lakshmi Narayana : బీజేపీని వీడుతూ కన్నా లక్ష్మీ నారాయణ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారతాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నా... ఎవరూ పట్టించుకోలేదు. కాగా... తాజాగా ఆయన పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళతారు అనే విషయం చెప్పనప్పటికీ.... పార్టీ వీడటానికి కారణాన్ని మాత్రం తెలియజేశారు.
బీజేపీని వీడుతూ కన్నా లక్ష్మీ నారాయణ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారతాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నా… ఎవరూ పట్టించుకోలేదు. కాగా… తాజాగా ఆయన పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళతారు అనే విషయం చెప్పనప్పటికీ…. పార్టీ వీడటానికి కారణాన్ని మాత్రం తెలియజేశారు.
సోమువీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన చెప్పారు. సోమువీర్రాజు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
2014లో మోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. 2019లో అభ్యర్థుల ఎంపిక లో కీలకంగా వ్యవహరించానని… మోదీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.
తాను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపానని.. సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని అన్నారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.