Breaking news: గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
గాంధీ ఆసుపత్రి వద్ద నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Breaking news: గాంధీ ఆసుపత్రి వద్ద నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరుద్యోగుల పక్షాన ఎమ్మెల్యే నిరాహార దీక్షకు పూనుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, యువతను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని ఆయన నినదించారు. ఈ తరుణంలో నిరహార దీక్షను విరమించాల్సిందిగా పోలీసులు కోరారు. దానికి ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అక్కడ ఉన్న పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున గోళ చేస్తున్నారు.
నిరుద్యోగలు ఆకాంక్షలను నెరవేర్చాలని మోతిలాల్ నాయక్ నిరాహార చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి తరలివస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులపై సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో విద్యార్థులు రోడ్డుపై పరుగెత్తుతున్నారు. దీనికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
DSC వాయిదా వేయాలంటు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/sv94LSJ58A