»It Officials Survey Continues For Third Day In Bbc Offices
BBCలో మూడో రోజు.. 10 మంది ఉద్యోగులే లక్ష్యంగా ‘సర్వే’
బీబీసీ కార్యాలయాల్లో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకున్నాయి. తభారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని.. అన్నారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా మూడో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే (Survey) పేరిట దాడులు చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai)లలోని కార్యాలయాల్లో ఈ సర్వే చేపడుతున్నారు. బీబీసీ ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి కంపెనీకి చెందిన 10 మంది సీనియర్ ఉద్యోగులు కార్యాలయంలోనే ఉంటున్నారు. వారితోనే ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఐటీ దాడుల నేపథ్యంలో తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని బీబీసీ ప్రకటించింది. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి (Work From Home) చేస్తున్నారని బీబీసీ తెలిపింది.
మంగళవారం మొదలైన దాడులు గురువారం కూడా కొనసాగాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పడం లేదు. ఇంకా ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడు చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, నిధుల పంపిణీ తదితర విషయాలపై ఈ దాడులు జరుగుతున్నాయని ఐటీ శాఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు కూడా తనిఖీలు కొనసాగుతుండడం.. సిబ్బందిని విచారించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంకెన్ని రోజులు సోదాలు చేస్తారని నిలదీస్తున్నాయి.
అయితే అధికారులు మాత్రం వీటిని ఖండిస్తున్నారు. పన్ను ఎగవేతలు, ఆదాయ లాభాలను దారి మళ్లించడం వంటి నేరాలకు బీబీసీ పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు. గతంలోనే ఈ విషయమై తాము నోటీసులు అందించినా బీబీసీ పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే నేపథ్యంలో బీబీసీ తమ ఉద్యోగులకు మెయిల్ ద్వారా లేఖ రాసింది. అధికారులకు సహకరించాలని ఉద్యోగులకు సూచించింది. బ్రాడ్ కాస్ట్ విభాగం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మిగిలిన వారు ఇంటి వద్ద నుండి పని చేయాలని తెలిపింది. ఈ సర్వే గురించి సోషల్ మీడియాలో (Social Media) స్పందించవద్దని స్పష్టం చేసింది. ఢిల్లీ, ముంబైలలోని తమ కార్యాలయాల్లో కొంత మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. ఉద్యోగులకు ఇళ్ల నుంచే పని చేసే అవకాశం కల్పించింది. అయితే ఈ దాడులపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అండగా ఉంటామని, తమ ఔట్ పుట్, జర్నలిజం ఇలాగే కొనసాగుతుందని బీబీసీ భరోసా ఇచ్చింది.
బీబీసీ కార్యాలయాల్లో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకున్నాయి. తభారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని, భావప్రకటనా స్వేచ్ఛ, మతం, విశ్వాసం వంటి వాటిని ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూనే ఉన్నామని చెప్పారు. అయితే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం.. ‘పన్ను ఎగవేత, అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నప్పుడు ఐటీ అధికారులు సర్వేలు చేస్తారు. సర్వే పూర్తయ్యాక ప్రెస్ నోట్ లేదా మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.
అయితే గుజరాత్ అల్లర్లలో మోడీ హస్తం ఉందంటూ ‘ఇండియా, ది మోడీ క్వశ్చన్’ పేరిట రెండు భాగాలుగా ఇటీవల డాక్యుమెంటరీ విడుదలైంది. ఈ అల్లర్లకు సంబంధించి న్యాయస్థానాల్లో క్లీన్ చిట్ లభించిన తర్వాత కూడా బీబీసీ ఉద్దేశపూర్వకంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించిందని భారత ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ఈ డాక్యుమెంటరీపై భారత్ లో నిషేధం విధించారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించిందనే కక్షతో ఈ దాడులు జరుగుతున్నాయని అందరికీ తెలిసిన బహిరంగ రహాస్యమే.