»Jagan Has Came To My Office Says Jsw Chairman Sajjan Jindal
Sajjan Jindal వైఎస్ జగన్ అప్పుడు యంగ్ బాయ్.. నా ఆఫీసుకొచ్చాడు
గతంలోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగన్ తాజాగా మరోసారి భూమి పూజ చేసి మళ్లీ 30 నెలల్లో పరిశ్రమను ప్రారంభిస్తామని ప్రకటించాడు. గతంలో చెప్పిన మాటే మళ్లీ చెప్పి జగన్ ప్రతిపక్ష విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. వాటిని పక్కన పెడితే భూమి పూజ అనంతరం జేఎస్ డబ్ల్యూ (JSW) చైర్మన్ సజ్జన్ జిందాల్ (Sajjan Jindal) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉక్కు పరిశ్రమ (Steel Factory)కు రెండో సారి శంకుస్థాపన చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లా (Kadapa District) జమ్మలమడుగులో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గతంలోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగన్ తాజాగా మరోసారి భూమి పూజ చేసి మళ్లీ 30 నెలల్లో పరిశ్రమను ప్రారంభిస్తామని ప్రకటించాడు. గతంలో చెప్పిన మాటే మళ్లీ చెప్పి జగన్ ప్రతిపక్ష విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. వాటిని పక్కన పెడితే భూమి పూజ అనంతరం జేఎస్ డబ్ల్యూ (JSW) చైర్మన్ సజ్జన్ జిందాల్ (Sajjan Jindal) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జగన్ యంగ్ బాయ్ అని, వ్యాపారం నేర్చుకోవడానికి జగన్ తన ఆఫీసుకు వచ్చాడని ప్రకటించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) చర్చనీయాంశంగా మారాయి.
కడప జిల్లా జమ్మలమడుగు (Jammalamadugu) మండలం సున్నపురాళ్లపల్లిలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ తో కలిసి జిందాల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సజ్జన్ మాట్లాడుతూ..‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) నాకు మంచి మిత్రుడు. ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన నాకు మెంటర్ గా ఉండేవారు. సీఎం జగన్ తో నాకు చాలా కాలంగా తెలుసు. అతడితో మంచి పరిచయం ఉంది. చాలా సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినప్పుడు.. అప్పుడు జగన్ చాలా చిన్నవాడు. అప్పుడు వైఎస్సార్ నాతో జగన్ ను ముంబై తీసుకెళ్లామని సూచించాడు. వ్యాపారం ఎలా చేయాలో జగన్ కు నేర్పించాలని కోరాడు. 15-17 సంవత్సరాల కిందట జగన్ నా కార్యాలయానికి కూడా వచ్చాడు. ఆంధ్ర ప్రాంతాన్ని వైఎస్సార్ ఎంతగానో అభివృద్ధి చేశాడు. నేడు జగన్ కూడా తండ్రి బాటలో నడుస్తున్నాడు. దేశంలో చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతున్నాను. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుంటా. స్టీల్ ప్లాంట్ ప్రారంభ అడుగు. భవిష్యత్ లో ఇది అద్భుతమైన స్టీల్ ప్లాంట్ గా రూపొందుతుంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. జగన్ ఆకాశానికి ఎత్తాడు.
అనంతరం సీఎం జగన్ కూడా సజ్జన్ జిందాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సజ్జన్ జిందాల్ ముందుకురావడం అభినందనీయమన్నారు. జిందాల్ లాంటి దిగ్గజ సంస్థకు చెందిన వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి పరిశ్రమను ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదన్నారు. రూ.8,800 కోట్లతో పరిశ్రమను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 30 నెలల్లో ఉక్కు పరిశ్రమ మొదటి దశను ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించాడు. అయిదేళ్లలో రెండో దశ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గతంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే మళ్లీ భూమిపూజ చేయడం జగన్ కే చెల్లిందని ఎద్దేవా చేశారు.
Our Chairman believes that the #KadapaSteelPlant embodies a spirit of responsibility & progress. By utilizing the latest clean energy and waste management systems, we aim to exceed industry standards in terms of environmental impact. pic.twitter.com/Ih3WZQ1Mxo