BPT: కొరిశపాడు మండలం రావినూతల నుంచి మేదరమెట్ల వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. దారి పొడుగునా గుంటలు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత కష్టంగా మారిందని, ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రోడ్డు మరమ్మత్తులు చేసిన ఉపయోగం లేదని వాపోతున్నారు.