Minister Amarnath : బుగ్గున కామెంట్స్ కి… మంత్రి అమర్నాథ్ వివరణ…!
Minister Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల మాట మీదనే ఉంది. పరిపాలన రాజధాని మాత్రం విశాఖ ఉంటుందని వారు చెబుతూ వస్తున్నారు. కాగా... తాజాగా...విశాఖ రాష్ట్రానికి రాజధాని అంటూ బుగ్గన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మొన్నటి వరకు మూడు రాజధానులు అని.. ఇప్పుడు... విశాఖ మాత్రమే రాజధాని అంటున్నారేంటనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బుగ్గన కామెంట్స్ కి మంత్రి అమర్నాథ్ వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల మాట మీదనే ఉంది. పరిపాలన రాజధాని మాత్రం విశాఖ ఉంటుందని వారు చెబుతూ వస్తున్నారు. కాగా… తాజాగా…విశాఖ రాష్ట్రానికి రాజధాని అంటూ బుగ్గన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మొన్నటి వరకు మూడు రాజధానులు అని.. ఇప్పుడు… విశాఖ మాత్రమే రాజధాని అంటున్నారేంటనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బుగ్గన కామెంట్స్ కి మంత్రి అమర్నాథ్ వివరణ ఇచ్చారు.
పరిపాలన విశాఖ నుంచే ఉంటుందని చెప్పాలన్నది బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఉద్దేశమని పేర్కొన్న అమర్ మూడు ప్రాంతాల నుంచి పాలన జరుగుతుందేమో అన్న సందేహాలు ఉండకూడదనే బుగ్గన స్పష్టత ఇచ్చారని, చూసే వాళ్ళ విధానాన్ని బట్టి ఇది అర్దం అవుతోందని అన్నారు.
ఇక వికేంద్రీకరణనే మా విధానం అని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక విశాఖపట్నం ఏపీకి కొత్త రాజధాని కాబోతుం ఆయన సీఎం వైఎస్ జగన్ కూడా రానున్న నెల్లలో విశాఖకు షిఫ్ట్ కానున్నారని తెలిపారు. విశాఖలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అని అన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటన్న ఆయన త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుందని కూడా అమర్ గుర్తుచేశారు.