»Bus Hit To Auto Four Women Workers Died In Dandumalkapur
Road Accident ఆటో-బస్సు ఢీ.. ‘పచ్చడి’ పనికి వెళ్తున్న నలుగురు దుర్మరణం
పచ్చడి తయారు చేసే పరిశ్రమలో వీరంతా కార్మికులు. ఉదయం పని కోసమని ఆటోలో బయల్దేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో పొగమంచు కారణమో లేక వేరే ఏమో కానీ ఆటో బస్సు ఎదురెదురుగా వచ్చాయి. ఆటోను బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో ముందు భాగంగా నుజ్జనుజ్జయ్యింది.
హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతంలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. ఉపాధి కోసం వెళ్తున్న మహిళా కార్మికుల (Women Workers) ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం పాలవగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రి (Hospital)కి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. విజయవాడ-హైదరాబాద్ (Hyderabad-Vijayawad) జాతీయ రహదారిపై సంభవించిన ఈ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ పరిధిలోని దండుమల్కాపురం (Dandumalkapur) పారిశ్రామిక పార్కులో 12 మంది మహిళా కార్మికులతో ఆటో వెళ్తున్నది. పచ్చడి తయారు చేసే పరిశ్రమలో వీరంతా కార్మికులు. ఉదయం పని కోసమని ఆటోలో బయల్దేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో పొగమంచు కారణమో లేక వేరే ఏమో కానీ ఆటో బస్సు ఎదురెదురుగా వచ్చాయి. ఆటోను బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో ముందు భాగంగా నుజ్జనుజ్జయ్యింది. తీవ్ర గాయాలైన డాకోజి నాగలక్ష్మి (28), వరకాంతం అనసూయ (55), సిలివేరు ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష (30) మృతి చెందారు. ఆటోలోని మిగతా 8 మంది కార్మికులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్సై సీతాపాండు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.