ఐపీఎల్ 16లో (IPL 2023) పంజాబ్ (Punjab Kings) వరుసగా రెండో విజయం దక్కించుకున్నది. బుధవారం ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో ఆ జట్టు 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన (Rajasthan Royals) గెలిచింది. తొలుత పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది. పంజాబ్ టీమ్ లో శిఖర్ ధావన్ 56 బంతుల్లో 86 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 60 పరుగులతో దూకుడుగా ఆడగా, హోల్డర్ 2 వికెట్లు తీశాడు. రాజస్థాన్ టీమ్ లో శాంసన్ 25 బంతుల్లో 42 పరుగులు, హెట్ మయర్ 18 బంతుల్లో 36 పరుగులు, ధ్రువ్ జూరెల్ (నాటౌట్) 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
పంజాబ్ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాథన్ ఎలిస్ 4 వికెట్లు తీసి (man of the match today ipl nathan lyon) రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. హెట్ మయర్, ధ్రువ్ జూరెల్ లు చివరలో చెలరేగినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. జట్టు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా హెట్ మయర్ వికెట్‌ను కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఐపీఎల్ అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో చాహల్ రెండో స్థానంలో నిలిచాడు. 132 ఇన్నింగ్స్ లో 171 వికెట్లతో రెండో స్థానంలో నిలిచిన మలింగను అధిగమించాడు. మలింగ 170 వికెట్లతో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో 158 ఇన్నింగ్స్ లలో 183 అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ధావన్ 50 సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో 48 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. ధావన్ కంటే కోహ్లీ, వార్నర్ ముందు ఉన్నారు. కాగా, ఐపీఎల్లో ఈ రోజు కోల్‌కతా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనున్నాయి.