»Fancy Scooty Number Goes For Rs 1 12 Crore In Himachal Pradesh
Fancy registration number for scooty: రూ.1 లక్ష స్కూటీకి రూ.1 కోటి ఫ్యాన్సీ నెంబర్
ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు... ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు... స్కూటీ కోసం.
ఏదైనా టూ వీలర్ లేదా కారు, ఇతర వాహనాలు కొనుగోలు చేసినప్పుడు చాలామంది ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వారు కూడా ఉంటారు. తమకు ఇష్టమైన నెంబర్ లేదా అందరినీ ఆకర్షించే నెంబర్ కోసం పెద్ద మొత్తంలో చెల్లించిన వారి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. ముఖ్యంగా సినిమా నటులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలు లేదా లక్షల రూపాయలు వెచ్చిస్తారు. కానీ ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు… ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు… స్కూటీ కోసం. మీరు విన్నది నిజమే.. స్కూటీ ఫ్యాన్సీ నెంబర్ కోసం కోటి రూపాయలకు పైగా బిడ్ దాఖలు చేశారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో చోటు చేసుకుంది. తాను రూ.1 లక్ష పెట్టి కొనుగోలు చేసిన స్కూటీ కోసం అక్షరాలా రూ.1 కోటి 11 వేలు పెట్టి ఇష్టమైన నెంబర్‌ను దక్కించుకోవాలనుకుంటున్నాడు.
సిమ్లాలో HP 999999 అనే నెంబర్‌ను రవాణా శాఖ తాజాగా వేలానికి పెట్టింది. ఇందుకోసం 26 బిడ్స్ దాఖలయ్యాయి. వారిలో కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రాంతానికి చెందిన వ్యక్తి కోటీ రూపాయలకు పైగా బిడ్ వేశాడు. వాస్తవానికి దాని రిజర్వ్ ధరను అధికారులు రూ.1000గా నిర్ధారించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు పెట్టాలనుకుంటే రూ.1 లక్ష వరకు పెట్టవచ్చునని అంటున్నారు. కానీ అతను అయితే ఏకంగా రూ.1 కోటికి పైగా బిడ్ దాఖలు చేశాడు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ బిడ్స్ ను స్వీకరిస్తారు. అత్యధిక బిడ్ దాఖలు చేసిన వ్యక్తికి ఈ నెంబర్ ను కేటాయిస్తారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ అథారిటీ HP 999999తో పాటు మరిన్ని ఫ్యాన్సీ నెంబర్ల కోసం బిడ్స్‌ను ఆహ్వానించింది. HP 990009, HP 990005, HP 990003 వంటి నెంబర్లకు కూడా వీఐపీగా పేర్కొని, ఫ్యాన్సీ నెంబర్ బిడ్స్ కోసం ఆహ్వానించింది. వీటి బిడ్స్ వ్యాల్యూ వరుసగా రూ.21 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలుగా ఉన్నాయి. వీఐపీ ఫ్యాన్సీ నెంబర్ అంటే చాలామందికి క్రేజ్. ఏళ్లుగా ఇది కనిపిస్తూనే ఉంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ క్రేజ్‌ను ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్ సాధ్యమైనంత వరకు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మనం తెలుగు రాష్ట్రాల్లోను ఫ్యాన్సీ నెంబర్ క్రేజ్ చూస్తూనే ఉన్నాం. ఏడాదిన్నర క్రితం జూనియర్ ఎన్టీఆర్ రూ.17 లక్షలు వెచ్చించి తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో ఫ్యాన్సీ నెంబర్ ఫీజును కొద్ది నెలల క్రితం పెంచింది ప్రభుత్వం. అంతకు ముందు రూ. 50 వేలుగా ఉన్న ధరను అప్పుడు రూ. 2 లక్షలకు పెంచింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 007, 001, 003, 0001, కేవలం 1.. ఇలా వివిధ ఫ్యాన్సీ నెంబర్లకు లక్షలు వెచ్చించి తీసుకున్న వారు ఎందరో ఉన్నారు.