Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, గాయాలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారు కొంతమంది గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద లారీని ఢీకొట్టింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారు కొంతమంది గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద లారీని ఢీకొట్టింది. పదిహను మంది గాయపడగా వారిని నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు రాయచూర్ నుండి హైదరాబాద్ వెళ్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మరో ఘటనలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి, పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు.