»Police Cancelled Permission To Chandrababu Anaparthi Meeting
Anaparthi: చంద్రబాబు సభకు నో పర్మిషన్.. నిన్న ఓకే.. నేడు రద్దు
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా కూడా లోకేశ్ మైక్ లేకుండానే పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏపీలో పర్యటిస్తుంటే అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా కూడా లోకేశ్ మైక్ లేకుండానే పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏపీలో పర్యటిస్తుంటే అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ‘ఇదేం కర్మ- మన రాష్ట్రానికి’ (Idem Kharma Mana Rashtraniki) అనే పేరుతో మూడు రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి (East Godavari District) జిల్లాలో శుక్రవారం చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా అకస్మాత్తుగా పోలీసులు అనుమతి (Permission Cancelled) నిరాకరించారు. సభ రద్దు చేసినట్లు పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాలన వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ‘ఇదేం కర్మ- మన రాష్ట్రానికి’అనే కార్యక్రమం చంద్రబాబు చేపట్టారు. బుధ, గురువారాల్లో ఈ కార్యక్రమం తీవ్ర ఆంక్షల నడుమ కొనసాగింది. కాగా శుక్రవారం అనపర్తి (Anaparthi) నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉండగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అనపర్తిలో నిర్వహించే సభకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గురువారమే అనపర్తి సభకు కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇచ్చారు. తెల్లవారగానే ఇచ్చిన అనుమతిని రద్దు చేయడం గమనార్హం. ఎందుకు రద్దు చేస్తున్నారో ఇచ్చిన కారణాలు చూస్తే నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఈ నోటీసులపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం అత్యంత రద్దీ ఉంటుందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రద్దీ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించలేరని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఐదు వేలకు మించి ప్రజలు పట్టే అవకాశం లేదంటూ అనుమతులు నిరాకరించారు. సామర్లకోట నుంచి బయల్దేరి చంద్రబాబు అనపర్తిలో భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని ముందే గ్రహించి ఈ అనుమతి రద్దు చేసినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం, జగ్గంపేట, పెద్దాపురంలో నిర్వహించిన సభలు విజయవంతం కావడంతోనే కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వ ఈ సభకు అనుమతి రద్దు చేసినట్లు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై టీడీపీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి తయారైంది. పాదయాత్రలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడంతో ఎక్కడ ప్రతిపక్షాలు బలంగా తయారవుతారోనని ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకుల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తోంది. పోలీసులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.