»Left Wing Activist Swara Bhasker Marries Samajwadi Party Leader Fahad Ahmed
Swara Bhasker : రాజకీయనాయకుడితో హీరోయిన్ పెళ్లి….!
Swara Bhasker : బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె ఓ రాజకీయ నాయకుడు ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్, పెళ్లి రెండూ అయిపోయాయి. ఆమె ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు.. నెట్టింట వైరల్ గా మారాయి.
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె ఓ రాజకీయ నాయకుడు ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్, పెళ్లి రెండూ అయిపోయాయి. ఆమె ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు.. నెట్టింట వైరల్ గా మారాయి.
ఇంతకీ వరుడు ఎవరు అనేగా మీ సందేహం.. అక్కడకే వస్తున్నా.. అతను సమాజ్ వాద్ పార్టీకి చెందిన యువ నాయకుడు. పేరు ఫహద్ అహ్మద్. వీరిద్దరూ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ మొదట స్నేహితులుగా ఉన్నారట. తర్వాత వారి స్నేహం ప్రేమకు దారితీసింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోని కూడా ఆమె పంచుకున్నారు. గతేడాదే పెళ్లి జరగగా… ఈ రోజు ఆమె తన పెళ్లిని అధికారికంగా ప్రకటించడం విశేషం.