ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది. ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇతరులకు అయితే 7.1 శాతం వడ్డీ రేటు ఉంది. ఎస్బీఐ స్టాఫ్, పెన్షనర్లు అదనంగా మరో 1 శాతం వడ్డీ రేటును పొందనుండటం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను దశాబ్దంన్నర కనిష్టానికి తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో ఫిక్స్డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD), వివిధ స్కీమ్స్ వడ్డీ రేటు కూడా తగ్గింది. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది కాలంగా ఆర్బీఐ రెపో రేటును క్రమంగా సవరిస్తూ మహమ్మారి ముందుస్థాయికి తీసుకు వచ్చింది. దీంతో బ్యాంకులు క్రమంగా వడ్డీ రేటును పెంచుతున్నాయి. ఇది డిపాజిటర్లకు అధిక మొత్తాన్ని ఇవ్వనుండగా, రుణాలు తీసుకునే వారికి అధిక భారం అవుతుంది. కరోనా సమయంలో రుణాలపై వడ్డీ రేట్లు కనిష్టానికి పడిపోయాయి. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. రెపో రేటు పెరుగుతుండటంతో ఆయా బ్యాంకులు డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చేలా డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నాయి. రుణాలు తీసుకునే వారికి కూడా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ ఇటీవల అమృత్ కలష్ డిపాజిట్ స్కీమ్ ను తీసుకు వచ్చింది. ప్రభుత్వరంగ, ప్రయివేటురంగ పెద్ద బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అధికంగా 8 శాతం లోపు ఉన్నాయి. అయితే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 9 శాతంగా కూడా ఉన్నాయి.
– అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కాల పరిమతి 400 రోజులు.
– ఈ డిపాజిట్ స్కీమ్ ఫిబ్రవరి 15, 2023 న ప్రారంభమైంది. 31 మార్చి 2023 న ముగుస్తుంది. అంటే నెల పదిహేను రోజుల సమయం ఇచ్చింది.
– అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.6 శాతం ఉంటుంది. సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. స్టాఫ్, పెన్షనర్లకు అదనంగా మరో ఒక శాతం వడ్డీ రేటు ఉంటుంది.
– ఈ సరికొత్త అధిక రిటర్న్స్ ఇచ్చే FD దరఖాస్తు కోసం సమీప ఎస్బీఐ బ్రాంచీకి వెళ్లవచ్చు లేదా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
– అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కోసం ఇండివిడ్యువల్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. స్వల్ప కాల లక్ష్యాలు కలిగిన వారు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక రిటర్న్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఏడాది కాల పరిమితి డిపాజిట్ తో పోలిస్తే ఈ స్కీమ్ లోనే అధిక రిటర్న్స్ ఉన్నాయి.
– ఉదాహరణకు ఈ FD స్కీమ్ లో మీరు రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే 400 రోజుల కాలపరిమతి తర్వాత మీకు.. అంటే సీనియర్ సిటిజన్లకు రూ.8600 వడ్డీ వస్తుంది. ఇతరులకు రూ.8,017 వస్తుంది.
– ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వడ్డీ పైన టీడీఎస్ కోత ఉంటుంది.
– అవసరాన్ని బట్టి డిపాజిట్‌ను ఉపయోగించుకునే సదుపాయం కూడా ఉండటం గమనార్హం. డిపాజిట్ ను బట్టి రుణ సదుపాయం ఉంటుంది.