Chetan Sharma Resigns: స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్, చేతన్ రాజీనామా
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ (BCCI chief selector) చేతన్ శర్మ (Chetan Sharma) ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీసీసీఐ (BCCI) కూడా వెంటనే ఆమోదించింది. ఇటీవలి ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో (sting operation) ఆయన సంచలన అంశాలు బయటపెట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. చేతన్ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ (BCCI chief selector) చేతన్ శర్మ (Chetan Sharma) శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీసీసీఐ (BCCI) కూడా వెంటనే ఆమోదించింది. ఇటీవలి ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో (sting operation) ఆయన సంచలన అంశాలు బయటపెట్టారు. దీంతో ఆయన తన పదవికి ఎసరు వచ్చింది. చేతన్ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తోంది.
అసలేం జరిగింది?
చేతన్ శర్మ(chetan sharma) ఇటీవల స్టింగ్ ఆపరేషన్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది. ఆటగాళ్ల ఫిట్నెస్ (fitness), విబేధాలు.. ఇలా వివిధ అంశాలపై ఆయన మాటలు వివాదాస్పదంగా మారాయి. టీమిండియా క్రికెటర్లు ఎనభై శాతం ఫిట్‌గా ఉన్నాసరే ఇంజెక్షన్లు తీసుకొని 100 శాతం ఫిట్నెస్ సాధిస్తారని, డోప్ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకాలు ఉపయోగిస్తారని, సరైన ప్రదర్శన చేయలేని ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తున్నారని బాంబు పేల్చారు. బూమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకముందే ఈ ఇంజెక్షన్ల సాయంతో ఆడించారని, అతను ఇప్పటికీ పూర్తిగా ఫిట్‌గా లేడన్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన టీ20 సిరీస్‌కు అతనిని తిరిగి తీసుకోవడంపై తనకు, జట్టు మేనేజ్మెంట్కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు చెప్పారు. ఆటగాళ్లు ఉత్ప్రేరకాలు ఉపయోగించి, తమను ఆడనివ్వమని బతిమాలుతారని చెప్పారు.
నిబంధనలు ఎవరు ఉల్లంఘిస్తారో మనం కచ్చితంగా చెప్పలేమన్నారు. ఎందుకంటే హోటల్లో ఎవరి గదులు వాళ్లకు ఉంటాయని, ప్రతి నిమిషం వారిని గమనిస్తూ ఉండలేం కదా అన్నారు. 99.9 శాతం మంది ఆటగాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేస్తారని, 0.5 శాతం మంది ఇలా చేస్తారన్నారు.
బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ (sourav ganguly), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య ఇగో సమస్య ఉండేదన్నారు. కోహ్లీ వ్యవహార శైలి గంగూలీకి నచ్చేది కాదన్నారు. బీసీసీఐ చీఫ్ వల్లే తాను కెప్టెన్సీ కోల్పోయానని భావించేవాడన్నారు. బీసీసీఐ కంటే తానే ఎక్కువగా విరాట్ భావించేవాడన్నారు. కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లు ప్రయోగాలు చేయాలనుకున్నారని, అందుకే కొన్నేళ్లుగా మార్చుతూ వస్తున్నామని గుర్తు చేశారు. కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా మాత్రం అతడే మూడు ఫార్మాట్లలో సారథిగా కొనసాగుతానని తమకు చెప్పారన్నారు. అయితే కోహ్లీని సారథ్య బాధ్యతల నుండి తొలగించడం గంగూలీ నిర్ణయం కాదని, ఉమ్మడి నిర్ణయమని స్పష్టం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే కెప్టెన్ ఉండాలని తాము భావిస్తున్నట్లు కోహ్లీకి చెప్పామని, టీ20 కెప్టెన్ బాధ్యతలు వదులుకునే సమయంలో… పునరాలోచన చేయాలని గంగూలీ చెప్పాడన్నారు. ఆ మాట కోహ్లీ విన్నాడో లేదో.. కానీ మీడియా ముందు మాత్రం తనకు గంగూలీ (sourav ganguly) కొనసాగమని చెప్పలేదని విరాట్ అబద్దం చెప్పాడన్నారు.
కోహ్లీ (virat kohli), రోహిత్ శర్మ (rohit sharma) మధ్య విభేదాలు లేవన్నారు. కానీ ఇరువురి మధ్య ఇగో ఉండేదన్నాడు. వారిద్దరు అమితాబ్, ధర్మేంద్ర వంటి పెద్ద స్టార్ల వంటి వారని చెప్పారు. జట్టులో మాత్రం వీరిద్దరి వర్గాలు ఉండేవన్నారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో రోహిత్ అండగా నిలిచాడన్నారు.
ఇక రోహిత్ శర్మ (rohit sharma), హార్దిక్ పాండ్యాలు (hardik pandya) తనను గుడ్డిగా నమ్ముతారని చెప్పారు. వారిద్దరు తమ ఇంటికి కూడా వచ్చారని, హార్దిక్ తరుచు తనను కలుస్తాడన్నారు. శుభ్‌మన్ గిల్ వంటి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి టీ20ల నుండి కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతి ఇచ్చినట్లు చెప్పారు. మున్ముందు రోహిత్ టీ20 క్రికెట్ ప్రణాళికల్లో ఉండడని, పాండ్యానే దీర్ఘకాలం కెప్టెన్‌గా ఉంటాడన్నారు. సూర్య కుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా వంటి పదిహేను.. ఇరవై మంది ఆటగాళ్లను జట్టులోకి తానే తీసుకు వచ్చినట్లు చెప్పారు. వీరి రాక సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్నారు. హెడ్ కోచ్ ద్రావిడ్‌తో జరిపిన చర్చలకు సంబంధించిన అంశాలను కూడా పంచుకున్నారు.