• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

vangalapudi anitha: జగన్ నీకు సిగ్గనిపించడం లేదా? రిజైన్ చేస్తే దరిద్రం పోతుంది

ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 14, 2023 / 01:23 PM IST

Marburg Virus : మరో కొత్త వైరస్ వ్యాప్తి.. 9 మంది మృతి

కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మరో వైరస్ తో ఉలిక్కి పడింది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ (Marburg Virus) కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం వెల్లడించింది.

February 14, 2023 / 01:21 PM IST

Amit Shah : కోర్టుకు వెళ్లండి… కాంగ్రెస్ కి అమిత్ షా సవాలు…!

Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

February 14, 2023 / 01:08 PM IST

Michigan University firing: అమెరికా వర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

February 14, 2023 / 10:53 AM IST

Rahul Gandhi : నేను మాట్లాడితే మోదీకి వణుకు…

Rahul Gandhi : ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన... అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు.

February 14, 2023 / 10:47 AM IST

HD Kumaraswamy: బ్రాహ్మణులు సీఎం కావొచ్చు.. కానీ వారు మాత్రమే

జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

February 14, 2023 / 10:23 AM IST

Kodali Nani: షాకింగ్… జగన్ పతనం కోరుకున్న వైయస్ వివేకా

వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.

February 14, 2023 / 09:51 AM IST

Woman married God Shiva: శివుడిని పెళ్లి చేసుకున్న యువతి, ఎందుకంటే?

మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా చౌరిసియా... శివుడిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా అంగీకరించింది.

February 14, 2023 / 09:16 AM IST

Valentines Day: అద్దెకు అబ్బాయి… ఒంటరిగా ఉన్నారా, అయితే ఈ ఆఫర్ మీకే!

గురుగ్రామ్‌కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్‌ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్‌స్టాలో 'boyfriend on rent'తో ప్రమోట్ చేస్తున్నాడు.

February 14, 2023 / 08:11 AM IST

Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్చేశారు

విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.

February 14, 2023 / 07:30 AM IST

Kishan Reddy: నేను రాజీనామాకు సిద్ధం..చర్చకు సిద్ధమా కేసీఆర్ చెప్పాలి

భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని ఎక్కడకు రావాలో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని చర్చకు రావాలని పేర్కొన్నారు.

February 13, 2023 / 01:53 PM IST

KCR రాజీనామా చేయ్.. డేట్, టైమ్ ఫిక్స్ చేయ్: బండి సంజయ్

సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయనని ప్రధాని చెప్పారని, దీనిపై కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని సంజయ్ ప్రశ్నించాడు. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని, 11 నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుందని తెలిపాడు. శాసనసభ సమావేశాలు రాజకీయ సభగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

February 13, 2023 / 01:20 PM IST

ICMR: దేశంలో 73% మందికి షుగర్, 65% మందికి ఉభకాయం వచ్చే ఛాన్స్!

ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.

February 13, 2023 / 12:53 PM IST

CM Jagan ఇంటి సమీపంలో ఘోరం.. గంజాయి మత్తులో అంధురాలు హత్య

సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది. పైగా అతడు గంజాయి మత్తులో ఉండడం గమనార్హం. ఏపీలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం నివాసం సమీపంలోనే గంజాయి దందా సాగుతోంది.

February 13, 2023 / 12:45 PM IST

Aero India Show ఆత్మవిశాసానికి ప్రతీక: ప్రధాని మోదీ

ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని ముఖ్య దేశాల వైమానిక సంస్థలు, వాయుసేన విమానాలు పాల్గొంటాయి. హెలికాప్టర్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు కూడా ప్రదర్శనకు వచ్చాయి. కంపెనీల మధ్య రూ.75 వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరుగుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు.

February 13, 2023 / 11:58 AM IST