»Union Minister Dharmendra Pradhan Rude Behaviour To Andhra Police
Go Back మీకు ఇక్కడేం పని.. ఆంధ్రా పోలీసులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.
Union minister Dharmendra Pradhan rude behaviour to Andhra police
Union minister Dharmendra Pradhan:కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు. కేంద్రమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
‘ఉత్కల్ దిబస’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) బీజేపీ ఎమ్మెల్యేలతో (bjp mla) కలిసి ఒడిశాలోని (odisha) కొఠియా గ్రూప్ గ్రామాల్లో పర్యటించారు. పట్టుచెన్నూరు వెళ్లగా.. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొఠియా సీఐ (kotia ci) రోహిణీపతిని మీరెవరని మంత్రి ప్రశ్నించారు. దీంతో తాము ఏపీ పోలీసులు (ap plice) అని బదులిచ్చారు. ఏపీ పోలీసులకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. కొఠియాలోని 21 గ్రామాలు (21 villages) ఇరు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని సీఐ (ci) చెప్పారు.
‘ఏపీ పోలీస్ గో బ్యాక్’ (ap police go back) అని ఆదేశించారు. కొఠియా ఒడిశాకే చెందినదని.. మంత్రి పేర్కొన్నారు. మంత్రి (minister) అలా అనడంతో ఆ వెంటనే ఆయన అనుచరులు కూడా ఏపీ పోలీస్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఏపీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై ఒడిశా అధికార పార్టీ బీజేడీ తీవ్రంగా స్పందించింది.
ఒడిశా-ఆంధ్ర సరిహద్దులో గల కొఠియా గ్రామాలపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడింది. ధర్మేంద్ర ప్రదాన్ ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రులు కొఠియా వివాదాన్ని పట్టించుకోలేదని బీజేడీ నేత ప్రదీప్ మాఝీ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఒడిశా పురాతన పేరు (ఉత్కల్) 1936 ఏప్రిల్ 1వ తేదీన ఒడిశా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అందుకు స్మరకంగా ‘ఉత్కల్ దివాస’ కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రదాన్.. కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.